ప్రచారంలో ‘జపాన్, తంగలాన్’ దూకుడు

తెలుగులో ఒక్కోసారి స్ట్రెయిట్ మూవీస్ కి మించిన రీతిలో డబ్బింగ్ మూవీస్ జోరు చూపించిన సందర్భాలున్నాయి. 2005 సమయంలో అయితే రజనీకాంత్, విక్రమ్, సూర్య వంటి వారు తమ సినిమాలతో ఇక్కడ పెద్ద హీరోలకు చెమటలు పట్టించారు. వీళ్లు నటించిన ‘చంద్రముఖి, అపరిచితుడు, గజిని’ సినిమాలు తెలుగులో వసూళ్ల వర్షం కురిపించాయి. అయితే ఆ తర్వాత తెలుగులో కొన్నాళ్ల పాటు అనువాద సినిమాల జోరు పెద్దగా కనిపించలేదు.

ఇప్పుడు మళ్లీ ఇక్కడ అనువాద సినిమాల జోరు కనిపిస్తుంది. ‘విక్రమ్, వారసుడు, బిచ్చగాడు 2, జైలర్, లియో
‘ వంటి సినిమాలు టాలీవుడ్ లో అదిరిపోయే కలెక్షన్స్ కొల్లగొట్టాయి. లేటెస్ట్ గా కోలీవుడ్ స్టార్స్ కార్తీ, విక్రమ్ తమ డబ్బింగ్ మూవీస్ తో టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. కార్తీ నటించిన ‘జపాన్’ దీపావళి కానుకగా విడుదలకు సిద్ధమైతే.. విక్రమ్ ‘తంగలాన్’ రిపబ్లిక్ డే స్పెషల్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది.

‘జపాన్’ ప్రచారంలో ఇప్పటికే దూకుడు పెంచారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. రేపు ఈ మూవీ నుంచి ‘చక్రాల్లాంటి’ అంటూ సాగే గీతం విడుదల కాబోతుంది. మరోవైపు రేపే విక్రమ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘తంగలాన్’ నుంచి టీజర్ రాబోతుంది.

Related Posts