వైభవంగా వరుణ్-లావణ్య హల్దీ వేడుక

వరుణ్ – లావణ్య పెళ్లి సందడి ఇటలీలో ఘనంగా జరుగుతోంది. నిన్న రాత్రి వీరిద్దరి పెళ్లికి సంబంధించిన కాక్ టెయిల్ సెలబ్రేషన్ జరిగింది. అతిథులందరూ సూట్స్ లో సందడి చేసిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు వీరి హల్దీ సెలబ్రేషన్స్ ఫోటోలు వచ్చాయి.

ఇటలీలోని పెళ్లి వేదిక వద్ద చెట్ల మధ్య సుందరమైన ప్రదేశంలో ఏర్పాటు చేసిన వరుణ్-లావణ్య హల్దీ వేడుకలో మెగా ఫ్యామిలీ అంతా సందడి చేసింది.

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి-సురేఖ దంపతులు వధూవరులను ఆశీర్వదిస్తున్న ఫోటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలలో తెలుపు, పసుపు వర్ణం దుస్తుల్లో వధూవరులు మెరిసిపోతున్నారు. రేపు వరుణ్-లావణ్య వివాహం జరగనుంది.

Related Posts