30యేళ్ల తర్వాత కుదిరిన కాంబినేషన్

సినిమా ఇండస్ట్రీలో 30యేళ్ల తర్వాత కూడా ఓ కాంబినేషన్ సెట్ అయిందంటే .. వాళ్లు అప్పటికే ఎన్ని శిఖరాలు అధిరోహించి ఉంటారో అంచనా వేయొచ్చు. యస్.. అలాంటి కాంబినేషనే.. ఇప్పుడు తెలుగులో రీపీట్ కాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి, ఎమ్ఎమ్ కీరవాణి కాంబినేషన్ ఇది. కీరవాణి సంగీత దర్శకుడుగా అడుగులు వేస్తూ తడబడుతూ వస్తున్న రోజుల్లో అతనికి ఫస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ఘరానా మొగుడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ మూవీ పాటలతోనే కీరవాణి కమర్షియల్ సినిమాలకు కూడా పనికొస్తాడు అనే ఇంప్రెషన్ వేశాడు. 1992 ఏపిల్ర్ 9న విడుదలైందీ సినిమా.

ఇక అదే యేడాది కళాతపస్వి కే విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన ఆపద్బాంధవుడుతో మరో కోణం చూపించాడు కీరవాణి. ఈ సినిమా అప్పట్లో కమర్షియల్ గా పెద్ద హిట్ కాదు. కానీ ఆడియో పరంగా బిగ్గెస్ట్ హిట్ అనిపించుకుంది. ఒకే యేడాది రెండు బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇవ్వడంతో ఈ కాంబినేషన్ లో కంటిన్యూస్ గా సినిమాలు వస్తాయనే అనుకున్నారు చాలామంది. కానీ ఎందుకో అది కంటిన్యూ కాలేదు.

ఆ రెండు సినిమాల తర్వాత 1994లో వచ్చిన ఎస్పీ పరశురామ్ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్. పాటలు కూడా ఒకట్రెండు బావుంటాయంతే. అంతే.. అప్పటి నుంచి మళ్లీ వీరి కాంబినేషన్లో సినిమా పడలేదు.

అప్పట్లో కీరవాణి ఇచ్చిన సంగీతానికి వీరి కాంబోలో మరిన్ని సినిమాలు వచ్చి ఉండాల్సింది. కానీ ఎందుకో రాలేదు. చిరంజీవి ఎక్కువగా రాజ్ కోటి, కోటి, మణిశర్మలతోనే ట్రావెల్ చేశాడు. అయితే ఈ కాంబినేషన్ దాదాపు 30యేళ్ల తర్వాత రిపీట్ కాబోతోందనే వార్తలు వస్తున్నాయి. .

భోళా శంకర్ తర్వాత చిరంజీవి ఓ మల్టీస్టారర్‌ చేయబోతున్నాడు. శర్వానంద్, వెంకటేష్ లు కూడా నటించే ఈ చిత్రానికి కళ్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకుడు. ఈ నెల నుంచే షూటింగ్ ప్రారంభం అవుతుందని చెబుతున్నారు. ఈ మూవీకి కీరవాణితో సంగీతం చేయింబోతున్నారు అనే టాక్స్ వినిపిస్తున్నాయి. ఇన్నేళ్ల తర్వాత మెగాస్టార్ రేంజ్ మారలేదు. అటు కీరవాణి ఏకంగా ఆస్కార్ వరకూ తన ప్రతిభను చాటుకున్నాడు. ఎలా చూసినా ఇప్పుడు వారి వారి ఫీల్డ్స్ లో శిఖర స్థాయిలోనే ఉన్నారు. అలాంటి వారు మరోసారి కలిసి పనిచేస్తారు అంటే ప్రేక్షకులు వీరి నుంచి ఎంతైనా ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. అయితే ఈ వార్త ఇంకా అఫీషియల్ గా బయటకు రాలేదు. కానీ దాదాపు కన్ఫార్మ్ అంటున్నారు.

Related Posts