ఆచార్యకు, భోళా శంకర్ కు ఉన్న తేడాలు అవే

ఏ హీరో కెరీర్ లో అయినా హిట్స్ అండ్ ఫ్లాప్స్ కామన్. ఎవరూ వీటికి అతీతం కారు. అయినా వాటిని దాటుకుని టాప్ ప్లేస్ కు చేరడం అంటే అంత సులువైన విషయం కాదు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు. అయితే ఈ మధ్య వచ్చిన రెండు సినిమాలు మెగా ఇమేజ్ ను బాగా డామేజ్ చేశాయనే చెప్పాలి. ముఖ్యంగా అవుట్ డేటెడ్ కథలను ఎంచుకోవడం వల్లే అభిమానులు కూడా హర్ట్ అయ్యేంత ఫలితాలు వచ్చాయి. అయితే ఈ రెండు సినిమాల మధ్య సారూప్యతల కంటే ఆ రెండు సినిమాల దర్శకుల గురించి చూస్తే ఖచ్చితంగా కొన్ని ఇంట్రెస్టింగ్ తేడాలు తెలుస్తాయి. ముందు ఆచార్య దర్శకుడు కొరటాల పరిస్థితి ఏంటో చూద్దాం..


కొరటాల శివ ఆచార్యకు ముందు వరకూ చేసిన మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్. అంత పెద్ద విజయాలు ఇచ్చిన దర్శకుడు సడెన్ గా డిజాస్టర్ ఇస్తాడు అని ఎవరూ ఊహించలేదు. అందుకే శివ కూడా తను చేసిన మిస్టేక్ విషయంలో చాలా ఫీల్ అయ్యాడు. ఈ సినిమా కోసం అతను చాలా మార్పులు చేశాడు అన్నారు కొందరు. చేయాల్సి వచ్చిందన్నారు ఇంకొందరు. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఫస్ట్ సినిమా అనే భారీ అంచనాలను మినిమం కూడా మ్యాచ్ చేయలేకపోయిందీ సినిమా. అందుకే కొరటాల శివనే అంతా టార్గెట్ చేశారు. అన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు ఆచార్యను పాదఘట్టం కింద నలిపేశాడని విమర్శలు గుప్పించారు. వీటిని సీరియస్ గా తీసుకున్నాడు కొరటాల. అందుకే చాలా బాధపడ్డాడు. తర్వాతి సినిమా విషయంలో ఆ తప్పులు రిపీట్ కాకుండా చాలా టైమ్ తీసుకుని మరీ ఎన్టీఆర్ నే ఒప్పించి దేవర చేస్తున్నాడు.


ఇక భోళా శంకర్ విషయంలో జరిగింది వేరే. దర్శకుడు మెహర్ రమేష్‌ కు ఈ డిజాస్టర్స్ కొత్త కాదు. ఇంకా చెబితే అలవాటైన వ్యవహారం. తెలుగులో ఫస్ట్ మూవీ కంత్రీ పోయింది. అయినా ప్రభాస్ బిల్లాతో ఛాన్స్ ఇచ్చాడు. టేకింగ్ బానే ఉంటుంది. అయినా ఈ సినిమా కూడా పోయింది. వరుసగా రెండు డిజాస్టర్స్ ఉన్నా.. ఎన్టీఆర్ ఇచ్చిన పవర్ ఫుల్ ఛాన్స్ వినియోగించుకోవడంలో శక్తి వంతంగా ఫెయిల్ అయ్యాడు మెహర్ రమేష్‌. శక్తి సినిమాతో నిర్మాతను వీక్ చేశాడు. అయినా రెండేళ్లకు తనూ బ్యాడ్ ఫేజ్ లో ఉన్న టైమ్ లో వెంకటేష్‌ 2013లో షాడోతో అవకాశం ఇచ్చాడు. షాడో మరో డిజాస్టర్. ఇలా వరుసగా డిజాస్టర్స్ ఉన్న వ్యక్తికి మరో డిజాస్టర్ పడితే పెద్దగా ఫీలయ్యేది ఏమీ ఉండదు. ఒకవేళ అతను హిట్ కొట్టి ప్రేక్షకులు ఆనందం కంటే ఎక్కువగా ఆశ్చర్యపోయేవారు అనేది నిజం. ఒక దర్శకుడుగా తన ప్రొఫెషన్ ను ఛాలెంజింగ్ గా తీసుకుంటే జాగ్రత్తలు ఉంటాయి. లేదూ అలవాటుగా మారిన తర్వాత అదే రిజిల్ట్ వస్తే నిరుత్సాహ పడటం అనే ప్రసక్తే ఉండదు. ప్రస్తుతం మెహర్ రమేష్‌ ఈ స్టేజ్ లోనే ఉన్నాడు.


సో ఆచార్య దర్శకుడు ఆ డిజాస్టర్ ను జీర్ణించుకోలేకపోయాడు. వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్స్ కొట్టిన తను ఇలాంటి సినిమా తీయడంపై ఆత్మ విమర్శ చేసుకునే ప్రయత్నం చేశాడు. అందుకే ఆచార్య అంత పెద్ద డిజాస్టర్ అయినా ప్యాన్ ఇండియన్ స్టార్ గా మారిన ఎన్టీఆర్ తన ఇమేజ్ ను కూడా ఫణంగా పెట్టి మరీ దేవరతో మరో అవకాశం ఇచ్చాడు. ఇటు భోళా విషయంలో మెహర్ రమేష్‌ ఎదుర్కొన్న ఫలితం అతనికీ తెలుసు. అంచేత.. మళ్లీ అతనికి ఇప్పట్లో మరో హీరో ఛాన్స్ ఇస్తాడు అనుకోలేం. అదీ తేడా. కొరటాలకుది చేశాక తప్పు అని తెలిసింది. మెహర్ తప్పు అని తెలిసీ చేశాడు.

Related Posts