డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ లో ప్రమాదం.. సంజయ్ దత్ కు గాయాలు

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా మాజీ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందిస్తోన్న సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై పూరీ జగన్నాథ్, ఛార్మి నిర్మిస్తోన్న ఈ మూవీ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తోంది. రీసెంట్ గా హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నెక్ట్స్ షెడ్యూల్ కోసం థాయ్ లాండ్ లో ఉందిప్పుడు. ఇక ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడని తాజాగా మూవీ టీమ్ నుంచి అధికారికమైన ప్రకనట వచ్చింది. సంజయ్ దత్ థాయ్ లాండ్ షెడ్యూల్ లో జాయిన్ అయ్యాడు.

ఇక లేటెస్ట్ గా థాయ్ లాండ్ లో కూడా ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్నామని ఆ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటూనే తర్వాతి షెడ్యూల్ ప్రారంభం అవుతుందన్న అప్డేట్ ఇస్తూ కొన్ని ఫోటోస్ ను విడుదల చేసింది మూవీ టీమ్.


అయితే ఈ సోమవారం స్టార్ట్ అయిన తర్వాతి షెడ్యూల్ లో మెయిన్ విలన్ గా నటిస్తోన్న ఓ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తుండగా గాయపడ్డాడట. ఆయన తలకు పెద్ద గాయమే అయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.సంజయ్ దత్ తలకు నాలుగు కుట్లు పడ్డాయని సమాచారం. ఫైట్ మాస్టర్ సూచనల లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.

అయితే సంజయ్ ఓ సీనియర్ ఆర్టిస్ట్ గా తన గాయాన్ని లెక్క చేయకుండా సీన్ పూర్తి చేసిన తర్వాతే హాస్పిటల్ కు వెళ్లాడు అని రొటీన్ డైలాగ్స్ చెబుతున్నా.. ఆయన గాయం కాస్త పెద్దదే అంటున్నారు. దీనివల్ల డబుల్ ఇస్మార్ట్ కు సంబంధించి ఈ షెడ్యూల్ పూరీ ప్లాన్ చేసుకున్నంత “వేగంగా” పూర్తి కాకపోవచ్చు అంటున్నారు.

Related Posts