మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కొత్త రిలీజ్ డేట్

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా. అనుష్క చెఫ్‌ పాత్రలో నటించింది. నవీన్ స్టాండప్ కమెడియన్ పాత్రలో కనిపించబోతున్నాడు. మహేష్‌ బాబు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్నా.. రిలీజ్ విషయంలో నిర్మాణ సంస్థ ఒక క్లారిటీకి రావడానికి నానా తంటాలు పడింది. ఆగస్ట్ 4న విడుదల చేస్తాం అని ప్రకటించారు. కానీ ఆ టైమ్ కు రాలేకపోయాడు. దీంతో ఆగస్ట్ 18 లేదా 25న విడుదల చేస్తారు అనే ప్రచారం జరిగింది. ఆ డేట్స్ లో పెద్దగా పోటీ కూడా లేదు. అందువల్ల సరైన నిర్ణయమే అవుతుందనుకున్నారు.

ఈ లోగా సెప్టెంబర్ 7న వస్తుందనే రూమర్స్ వచ్చాయి. ఆ రోజు షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఆ సినిమాక పోటీగా రావడం మిస్ అండ్ మిస్టర్ శెట్టి చేసే సాహసం అన్నారు. బట్ వీళ్లు ఎవరి మాటా విన్నట్టు కనిపించడం లేదు. అందుకే శ్రీ కృష్ణాష్టమినే ఫిక్స్ చేసుకున్నారు.


మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిని సెప్టెంబర్ 7న విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు మూవీ టీమ్ నుంచి మరోసారి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. విశేషం ఏంటంటే.. జవాన్ లాంటి భారీ సినిమా ఉన్నా.. వీళ్లు కూడా ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియన్ మూవీగానే రిలీజ్ చేస్తున్నారు. మరి అనుష్క తప్ప ప్యాన్ ఇండియన్ మూవీ అనేందుకు ఏ అట్రాక్షన్ లేని ఈ చిత్రానికి ఆ స్థాయిలో ఆదరణ ఉంటుందా అంటే డౌటే అని చెప్పాలి. అయితే ఈ రిలీజ్ డేట్ కోసం ప్లాన్ చేసిన వీడియో మాత్రం బావుందని చెప్పాలి. నవీన్ పోలిశెట్టి జాతకం చూపిస్తూ సినిమా రిలీజ్ డేట్ గురించి అడగటం తమ మీద తామే సెటైర్ వేసుకున్నట్టుగా ఉంది.

Related Posts