బన్నీ బర్త్‌డే స్పెషల్స్ రెడీ అవుతున్నాయ్!

ఏప్రిల్ నెలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు వస్తోంది. ఏప్రిల్ 8న బన్నీ బర్త్‌డే స్పెషల్ గా కొత్త సినిమాల నుంచి కొత్త అప్డేట్స్ ను అందించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. ఈ లిస్టులో మొదటిగా వచ్చేది ‘పుష్ప 2’ టీజర్. ‘పుష్ప.. ది రైజ్’తో పాన్ ఇండియా మార్కెట్ లోకి చొచ్చుకెళ్లిన బన్నీ.. ఇప్పుడు ‘పుష్ప.. ది రూల్’తో పాన్ ఇండియా మొత్తాన్ని దున్నేయడానికి రెడీ అవుతున్నాడు.

ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల తేదీ ఖరారు చేసుకున్న ‘పుష్ప 2’ నుంచి ఇప్పటికే విడుదలైన ‘వేర్ ఈజ్ పుష్ప’ స్పెషల్ టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు బన్నీ బర్త్ డే స్పెషల్ గా ‘పుష్ప 2’ నుంచి అసలుసిసలు టీజర్ ని వదలబోతున్నారట. ఈ టీజర్ లో ‘పుష్ప’ అడ్డాని మరింతగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడట సుకుమార్. ఏప్రిల్ 8న ‘పుష్ప 2’ టీజర్ రానుందట.

ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా.. అప్ కమింగ్ మూవీస్ విషయంలోనూ ఓ క్లారిటీ రానుంది. ముఖ్యంగా ‘పుష్ప 2’ తర్వాత పట్టాలెక్కే బన్నీ నెక్స్ట్ పై ఓ అవగాహన వచ్చే అవకాశం ఉంది. అదే రోజు అట్లీతో బన్నీ చేయబోయే సినిమాపైనా క్లారిటీ రానుంది. అలాగే.. త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా చిత్రాల గురించి స్పెషల్ అప్డేట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.

Related Posts