తండేల్‘ డిజిటల్ రైట్స్ కి క్రేజీ ఆఫర్

తెలుగులో కొన్ని క్రేజీ మూవీస్ కి కేవలం థియేట్రికల్ రైట్స్ మాత్రమే కాదు.. అంతకు మించి అన్న రీతిలో నాన్-థియేట్రికల్ బిజినెస్ జరుగుతుంది. ఈ లిస్టులో చెప్పుకోవాల్సిన సినిమా ‘తండేల్‘. నాగచైతన్య నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇది. ఇప్పటికే ‘కార్తికేయ 2‘ వంటి పాన్ ఇండియా హిట్ అందుకున్న చందూ మొండేటి డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మిస్తుంది.

‘లవ్ స్టోరీ‘ తర్వాత నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘తండేల్‘ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజులో జరుగుతుందట. సినిమా ఇంకా చిత్రీకరణ దశలో ఉండగానే.. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ఓటీటీ జయంట్ నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తానికి దక్కించుకుందట. ఈ సినిమాని దక్షిణాది భాషలతో పాటు హిందీ వెర్షన్ కలుపుకుని దాదాపు రూ.40 కోట్లకు కొందట నెట్ ఫ్లిక్స్. నాగచైతన్య సినిమాల్లోనే ఇదొక బిగ్ డీల్ అని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ‘తండేల్‘.. డిసెంబర్ లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.

Related Posts