జూన్ నుంచి పట్టాలెక్కనున్న ‘ఆర్.సి. 16‘

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్‘తో బిజీగా ఉన్నాడు. గ్రేట్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా లేటెస్ట్ గా హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో రామ్ చరణ్, సునీల్, నవీన్ చంద్ర వంటి నటులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించాడట శంకర్. ఇక.. మే 1 నుంచి చెన్నైలో ‘గేమ్ ఛేంజర్‘ కొత్త షెడ్యూల్ షురూ కాబోతుంది.

ఈ సినిమాలో చరణ్ పోషించే పెద్ద పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ను చెన్నైలో చిత్రీకరించనున్నారట. మే చివరి వరకూ లేదా జూన్ తో ‘గేమ్ ఛేంజర్‘ పూర్తయ్యే అవకాశాలున్నాయి. దీంతో.. జూన్ ఎండింగ్ లేదా జూలై నుంచి బుచ్చిబాబు తో చేయబోయే ‘ఆర్.సి. 16‘ని మొదలుపెట్టనున్నాడట రామ్ చరణ్. ఇప్పటికే ‘ఆర్.సి. 16‘ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఓ కొలిక్కి వచ్చేశాయట. ఈ సినిమాలో చరణ్ పోషించే పాత్రకు సంబంధించి మేకోవర్ కూడా రెడీ చేశాడట డైరెక్టర్ బుచ్చిబాబు. ఈ మూవీలో చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుంటే.. ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Related Posts