పవన్ కళ్యాణ్‌ తో భోళా శంకర్ ట్రైలర్

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ భోళా శంకర్. ఒకప్పుడు వరుస ఫ్లాపులు ఇచ్చి.. నిర్మాతలను భయపెట్టిన మెహర్ రమేష్‌ ఈచిత్రానికి దర్శకుడు. సినిమాలు ఎలా ఉన్నా.. మెహర్ రమేష్‌ టేకింగ్ మాత్రం అదిరిపోతుందని చెప్పాలి. హీరో ఎలివేషన్స్ లోనూ అతని స్టైల్ కొత్తగా ఉంటుంది. బిల్లా సినిమాల ప్రభాస్ ను ఎంత స్టైలిష్ గా చూపించాడో అందరికీ తెలుసు.

విశేషం ఏంటంటే.. కన్నడలో అతనికి రెండు భారీ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ఆంధ్రావాలాను వీర కన్నడిగ పేరుతో రీమేక్ చేస్తూ పునీత్ రాజ్ కుమార్ కు మంచి హిట్ ఇచ్చాడు. అలాగే తెలుగు ఒక్కడు చిత్రాన్ని అజయ్ పేరుతో అదే హీరోతో రీమేక్ చేశాడు. ఈ రెండూ సూపర్ హిట్స్ అయ్యాయి.

ఆ తర్వాతే అతను తెలుగులో క్రాంతి సినిమా చేశాడు. ఈ మూవీ బానే ఉంటుంది. అటుపై బిల్లా, శక్తి, షాడో అంటూ వరుసగా డిజాస్టర్స్ పడ్డాయి. వరుసగా ఫ్లాపులు పడుతున్నా.. ప్రతి సినిమా భారీ బడ్జెట్ తోనే రూపొందడం విశేషం.


2013లో వచ్చిన షాడో తర్వాత మళ్లీ దర్శకత్వ అవకాశం రాలేదు మెహర్ రమేష్‌ కు. అయితే అప్పటి నుంచి మెగాస్టార్ తో పాటు మహేష్‌ బాబును అంటిపెట్టుకుని ఉన్నాడు. అందుకు ప్రతిఫలంగానే ఇప్పుడు చిరంజీవి భోళా శంకర్ కు ఆఫర్ ఇచ్చాడు.

ఆగస్ట్ 11న విడుదల కాబోతోన్న ఈ మూవీపై ఇప్పటికైతే భారీ అంచనాలున్నాయి అని చెప్పలేం. రీసెంట్ గా వచ్చిన టీజర్ మెగా ఇమేజ్ ను ఎలివేట్ చేసింది తప్ప కొత్తగా ఏంలేదు. కాకపోతే ఇక ట్రైలర్ కు టైమ్ అయింది. ఆ ట్రైలర్ ను పవన్ కళ్యాణ్‌ తో కలిపి విడుదల చేస్తున్నారు.


పవన్ కళ్యాణ్‌, సాయితేజ్ కలిసి నటించిన బ్రో మూవీ ఈ నెల 28న విడుదల కాబోతోంది. ఈ మూవీతో పాటుగా భోళా శంకర్ ట్రైలర్ ను థియేటర్స్ లోనే వదలబోతున్నారు. అంటే మెగా ఫ్యాన్స్ కు ఒకేసారి డబుల్ బొనాంజా అన్నమాట. పవన్ సినిమాలో చిరంజీవి పేరు వినిపించినా..

చిరంజీవి సినిమాలో పవన్ పేరు వినిపించినా.. థియేటర్స్ మార్మోగిపోతాయి. అలాంటిది.. పవన్ మూవీతో పాటుగా మెగాస్టార్ ట్రైలర్ అంటే ఇంటర్వెల్ దద్దరిల్లిపోతుందన్నమాట.

Related Posts