‘పుష్ప’రాజ్ స్వాగ్ మామూలుగా లేదు

‘పుష్ప 2’ ప్రమోషన్స్ షురూ అయ్యాయి. ఆగస్టులో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ క్రేజీ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ వస్తోంది. మే 1న సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు ‘పుష్ప పుష్ప’ అంటూ సాగే టైటిల్ సాంగ్ రిలీజ్ కాబోతుంది. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ కంపోజిషన్ లో ఇప్పటికే రిలీజైన ‘పుష్ప పుష్ప’ ప్రోమోకి సూపర్బ్ అప్లాజ్ వచ్చింది. దీంతో.. ఈ సాంగ్ పై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లోనూ ఈ పాట విడుదలకాబోతుంది. మన తెలుగు సినిమాలో బెంగాల్ లో డబ్ అవ్వడం ‘పుష్ప 2’తో మొదలవ్వబోతుంది.

‘పుష్ప 2’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ సందర్భంగా.. ఓ కొత్త పోస్టర్ వదిలింది టీమ్. ఈ పోస్టర్ లో పుష్పరాజ్ గా అల్లు అర్జున్ స్వాగ్ మామూలుగా లేదు. టక్ చేసుకుని.. షూ వేసుకుని.. మెడలో బంగారం గొలుసులు.. వేళ్లకు బంగారం ఉంగరాలు పెట్టుకుని.. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ గెటప్.. ఆ స్వాగ్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక.. ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ ‘ది రైజ్’లో తన సామ్రాజ్యాన్ని సృష్టించుకోవడానికి పుష్పరాజ్ ఎలా కష్టపడ్డాడు అని చూపించాడు క్రియేటివ్ జీనియస్ సుకుమార్. ఇప్పుడు పార్ట్ టూ ‘ది రూల్’లో తన సామ్రాజ్యాన్ని ఎలా పరిపాలించాడు అన్నది చూపించబోతున్నాడు. ఆగస్టు 15న పాన్ ఇండియా లెవెల్ లో ‘పుష్ప 2’ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Related Posts