రెండు వారాల గ్యాప్ లో రెండు సినిమాలతో కమల్

‘విక్రమ్‘ హిట్ తో సూపర్ ఫామ్ లోకి వచ్చేశాడు విశ్వనటుడు కమల్ హాసన్. ఈ సినిమాతో కనీవినీ ఎరుగని కలెక్షన్ల రికార్డుల కొల్లగొట్టాడు. ఈనేపథ్యంలో.. కమల్ నుంచి రాబోయే సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే.. ఒకటి కాదు.. ఏకంగా రెండు సినిమాలతో డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడు కమల్. అది కూడా కేవలం రెండు వారాల గ్యాప్ లో.

కమల్ హాసన్-శంకర్ కలయికలో రాబోతున్న క్రేజీ మూవీ ‘ఇండియన్ 2‘. ఈ చిత్రాన్ని జూన్ లో విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. అయితే.. జూన్ లో ఏ తారీఖున రాబోతుందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. లేటెస్ట్ కోలీవుడ్ టాక్ ప్రకారం ‘ఇండియన్ 2‘ జూన్ 13న విడుదలకు ముస్తాబవుతోందట. మే 15న ‘ఇండియన్ 2‘ సినిమా ఆడియో రిలీజ్ ను గ్రాండ్ లెవెల్ లో నిర్వహించనున్నారట.

జూన్ 13న ‘ఇండియన్ 2‘ వస్తుంటే.. రెండు వారాల తర్వాత జూన్ 27న ‘కల్కి‘తో మరోసారి ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు కమల్ హాసన్. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి‘ సినిమాలో ఎంతో కీలకమైన పాత్రలో కమల్ కనిపించనున్నాడట. అయితే.. ‘కల్కి‘ ఫస్ట్ పార్ట్ లో తక్కువ నిడివే ఉన్నా.. సెకండ్ పార్ట్ లో మాత్రం కమల్ రోల్ ఎక్కువ సేపే ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. మొత్తంమీద.. కేవలం రెండు వారాల గ్యాప్ లోనే విశ్వనటుడు రెండు సినిమాలతో వస్తున్నాడన్నమాట.

Related Posts