రేపటి నుంచి నెట్ ఫ్లిక్స్ లో ‘హీరామండి‘

బాలీవుడ్ బడా డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన తొలి వెబ్ సిరీస్ ‘హీరామండి‘. సంజయ్ లీలా భన్సాలీ సినిమాలంటేనే భారీతనానికి కేరాఫ్ అడ్రస్ లా ఉంటాయి. ఇక.. తన సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో ‘హీరామండి‘ సిరీస్ ను తెరకెక్కించాడు భన్సాలీ. ‘ది డైమండ్ బజార్‘ అనేది ఈ మూవీకి ట్యాగ్ లైన్. తన గత చిత్రం ‘గంగూభాయి కతియవాడి‘ తరహాలోనే వేశ్యల కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

స్వాతంత్ర్యం రాకముందు లాహోర్ లోని వేశ్యల విలాసవంతమైన జీవితం.. స్వాతంత్య్ర ఉద్యమంలో వారి పాత్ర ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కించాడు. ఈ సిరీస్ లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీ, రిచా చద్దా వంటి నటీమణులు నటించారు. ఇప్పటికే ప్రచార చిత్రాలతో మంచి బజ్ ఏర్పరచుకున్న ‘హీరామండి‘ రేపటి (మే 1) నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

Related Posts