మహేష్ బాబు కు నయనతార ఎందుకు నచ్చదు

సూపర్ స్టార్ మహేష్‌ బాబు సరసన ఆఫర్ వస్తే ఏ హీరోయిన్ కాదనుకుంటుంది. అంటే ఓ పెద్ద స్టార్ సినిమాలో నటిస్తే తన రేంజ్ మారుతుంది. బ్లాక్ బస్టర్ అయితే ఓవర్ నైట్ టాప్ లీగ్ లోకి వెళ్లిపోవచ్చు. అదే టైమ్ లో ఆల్రెడీ స్టార్ అయిన హీరోయిన్స్ కూడా ఆ స్టార్డమ్ ను కంటిన్యూ చేయాలనే చూస్తుంటారు

. అలా మహేష్‌ బాబు సరసన ఆఫర్ వచ్చినా అనవసరమైన కండీషన్స్ పెట్టి అవకాశాలు కోల్పోయింది నయనతార. అందుకే ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా రాలేదు. నిజానికి ఒక దశలో నయనతార ఉండాలని చాలామంది హీరోలు అనుకున్నారు.

కానీ ఎందుకో తను తమిళ్ కు ఇచ్చినంత ప్రాధాన్యం తెలుగు సినిమాకు ఇవ్వలేదు. చేసిన కొన్ని సినిమాలు మాత్రం విజయవంతం అయ్యాయి. ఆ టైమ్ లో అమ్మడు అందాలారబోతలో టాప్ లీగ్ లో ఉంది. అది కూడా తను ఉండాలి అనుకోవడానికి ఓ కారణం.


అలా సూపర్ స్టార్ సరసన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఒన్ నేనొక్కడినే వంటి చిత్రాల్లో ముందుగా నయనతారనే అనుకున్నారు. హీరో మహేష్‌ బాబు అని తెలిసిన తర్వాత కూడా తను అతనికి మించిన కండీషన్స్ పెట్టిందట. ఇందుకు దర్శక నిర్మాతలు ఒప్పుకున్నా.. ఓ దశలో ఆమె షరతులు శృతి మించాయిఅని తెలిసిన మహేష్‌ బాబు నయనతారను తీసేయమని చెప్పాడు అంటారు.

ఆ కారణంగానే రెండు సార్లు మహేష్‌ సినిమాలో నటించే అవకాశాన్ని కోల్పోయింది నయనతార. ఇప్పటికీ ఈ విషయం తెలియక ఎవరైనా ఈ సినిమాలో నయనతార అయితే ఎలా ఉంటుంది అని మహేష్‌ ను అడిగితే అతను ఇమ్మీడియొట్ గా నో చెబుతాడు. అందుకే ఈ వీరి కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాలేదు.

Related Posts