నాగశౌర్య డైలాగ్సేనా .. విషయం కూడా ఉంటుందా..

ఏ హీరో అయినా తను చేస్తోన్న సినిమాపై నమ్మకంగా ఉంటాడు.ఆ సినిమా విజయం సాధిస్తుందని బలంగా నమ్ముతాడు. అతనే కాన్ఫిడెంట్ గా లేకపోతే ఇంక మిగతా వాళ్లు ఎలా ఉంటారు. ఈ నెల 7న రంగబలి సినిమాతో రాబోతోన్న నాగశౌర్య కూడా అలాగే కనిపిస్తున్నాడు.

రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా హిట్టూ, సూపర్ హట్టూ కాదు.. కేవలం బ్లాక్ బస్టర్ మాత్రమే అవుతుంది అన్నాడు శౌర్య. నమ్మకం మంచిదే. కానీ అతిగా మారితే అసలుకే మోసం వస్తుంది. బట్‌ అతని కాన్ఫిడెన్స్ చూస్తే ముచ్చటేస్తుంది.అదే టైమ్ లో కొన్ని అనుమానాలూ కలుగుతున్నాయి. అతి సర్వత్రా వర్జయేత్ అని సంస్కృతంలో అంటారు కదా..? అలా.. అతి నమ్మకం కూడా ఒక్కోసారి కొంప ముంచుతుంది.

అలా మునిగిన సినిమాలు చాలానే ఉన్నాయి. మరోవైపు ఈ సినిమా ప్రమోషన్స్ చూస్తే కూడా తెలుగు సినిమా సామెత గుర్తుకు రాక మానదు. ‘విషయం వీక్ గా ఉన్నప్పుడే ప్రమోషన్స్ పీక్స్ లో ఉంటాయి” అంటారు కదా..? అది ఈ చిత్రానికి కూడా వర్తిస్తుందా అనిపిస్తోంది.


నిజానికి రంగబలి టీజర్ ఆకట్టుకుంది. ట్రైలర్ హిలేరియస్ గా అనిపించింది. ట్రైలర్ తో ప్రామిసింగ్ గానూ అనిపించారు. బట్ ఇలా టీజర్, ట్రైలర్ తో వావ్ అనిపించుకుని సినిమా చూశాక వామ్మో అనుకున్న సందర్భాలు ఈ మధ్య కాలంలోనే అనేకం ఉన్నాయనేది నిజం.

రంగబలి ప్రమోషన్స్ లో ప్రధానంగా ముగ్గురే కనిపిస్తున్నారు. నాగశౌర్య, సత్య, దర్శకుడు పవన్. హీరోయిన్ ఆచూకీ కూడా లేదు. కావాలనే తనను సైడ్ చేశారా లేక ఇంకేదైనా రీజన్ ఉందా అనేది తెలియదు కానీ.. సత్య మల్టీ గెటప్స్ ఇంటర్వ్యూ మాత్రం బావుంది.

బట్.. బయటి ఇంటర్వ్యూస్ బావున్నంత మాత్రాన సినిమాలూ బావుంటాయి అని చెప్పలేం కదా.. పైగా వివిధ ఛానల్స్ యాంకర్స్ ను ఇమిటేట్ చేస్తూ సత్య తన టాలెంట్ చూపించుకున్నాడు. కానీ అది సినిమాకు ఎంత మాత్రం ప్లస్ అవుతుందంటే ఆన్సర్ ఉండదు.

మొత్తంగా రంగబలిపై హీరో కాన్ఫిడెన్స్.. ప్రమోషన్స్ లో ఉన్న దూకుడు చూస్తుంటే ష్యూర్ షాట్ అనే ఫీలింగ్ తో పాటు.. సమ్ థింగ్ ఫిషీ అనే ఫీలింగ్ కూడా ఒకేసారి కలుగుతున్నాయనేది ఆడియన్స్ నుంచి వినిపిస్తోన్న మాట. మరి వీరి ఏ ఫీలింగ్ కరెక్ట్ అనేది 7న తేలిపోతుంది.

Related Posts