యాక్సిడెంటల్‌ హీరోయిన్ అయ్యాను : ట్రూలవర్‌ హీరోయిన్‌ శ్రీగౌరిప్రియ

ట్రూలవర్‌.. మణికందన్‌ , శ్రీ గౌరీప్రియ జంటగా… ప్రభురామ్‌ వ్యాస్‌ డైరెక్షన్‌లో ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించిన సినిమా. ఈ మూవీని SKN, డైరెక్టర్‌ మారుతి తెలుగు ప్రేక్షకులకు ప్రజెంట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 10 న రిలీజ్‌ కాబోతున్న ఈ సినిమా గురించి మీడియాతో ముచ్చటించారు హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ.


2018లో మిస్ హైదరాబాద్ గా సెలెక్ట్ అయిన తర్వాత నాకు సినిమా ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ మొదలయ్యాయి. ఆర్ట్ అంటే ఇష్టం ఉన్నా..యాక్సిడెంటల్‌గానే హీరోయిన్ అయ్యానన్నారు. లాక్‌డౌన్‌ టైమ్‌లో మెయిల్ అనే వెబ్‌సిరీస్‌ చేసిన తర్వాత మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత సుహాస్‌ రైటర్‌ పద్మభూషణ్ సినిమా, మ్యాడ్‌ మూవీ వరుసగా ఆఫర్స్ వచ్చాయి. ఇవన్నీ మంచి పేరు తెచ్చిపెట్టాయి. మోడరన్‌ లవ్‌ చెన్నై వెబ్‌సిరీస్‌ తమిళ ఆడియెన్స్‌కి దగ్గర చేసింది. ఇందులో పర్‌ఫార్మెన్స్‌ చూసి ట్రూలవర్‌ కోసం అప్రోచ్‌ అయ్యారన్నారు గౌరిప్రియ.


మన ప్రేమ కథల్లో హీరో హీరోయిన్స్ ప్రేమించుకోవడం, వాళ్ల మధ్య ఏవో విబేధాలు రావడం, చివరకు మళ్లీ కలుసుకోవడం ..ఇలాంటి ఫార్మేట్ చూస్తుంటాం. కానీ ప్రభురామ్ వ్యాస్ గారు ఈ కథను మల్టీ డైమెన్షన్ తో తెరకెక్కించారు. మన జీవితంలో ఏదీ రైట్ కాదు, ఏదీ రాంగ్ కాదు. సందర్భాన్ని బట్టి, మనం ఆ విషయాన్ని చూసే కోణాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కోలా తీసుకుంటారు. అలా ఒక అమ్మాయి అబ్బాయిని చూసే పర్సెప్షన్, అబ్బాయి అమ్మాయిని చూసే పర్సెప్షన్ కొన్ని వేర్వేరు సందర్భాల్లో ఎలా ఉంది అనేది ఈ సినిమాలో ఎంతో సహజంగా డైరెక్టర్‌ ప్రభురామ్‌ వ్యాస్‌ తెరకెక్కించారన్నారు.


“ట్రూ లవర్” సినిమాలో దివ్య అనే క్యారెక్టర్ లో నటించాను. సెట్స్ లోకి వెళ్లే ముందు వర్క్ షాప్స్ చేశాం. నేను తమిళంలో డబ్బింగ్ చెప్పాను. అందుకు మా టీమ్ ఎంతో హెల్ప్ చేశారన్నారు.
దివ్య క్యారెక్టర్ లో అనేక షేడ్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్ పరిధి మేరకే నటించేలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఎందుకంటే దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ దివ్య క్యారెక్టర్ ను అంత యూనిక్ గా స్క్రిప్ట్ చేశారు. మణికందన్ తో కలిసి నటించడం హ్యాపీగా అనిపించింది. ఆయన టాలెంటెడ్ పర్సన్. సెట్ లో ఎంతో కోపరేటివ్ గా ఉండేవారని చెప్పారు గౌరిప్రియ.


ట్రూ లవర్” సినిమాను తెలుగులో ఎస్ కేఎన్, మారుతి గారు రిలీజ్ చేస్తున్నారని తెలిసినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యా. వాళ్లు రిలీజ్ చేస్తే తెలుగు ఆడియెన్స్ కు బాగా రీచవుతుంది. తెలుగు అమ్మాయిగా తమిళ మూవీస్ చేయడం టాలీవుడ్ కు దూరమైనట్లు భావించడం లేదు. తెలుగులోనూ మంచి ఆఫర్స్ వస్తున్నాయి. “ట్రూ లవర్” రిలీజ్ అయ్యాక వాటి వివరాలు చెబుతాన్నారు హీరోయిన్ శ్రీ గౌరిప్రియ.

Related Posts