వైఎస్‌ జగన్‌ పాత్ర చేయడం చాలా కష్టమైంది : హీరో జీవా

వైఎస్‌ జగన్‌ పొలిటికల్ జర్నీ ఆధారంగా రాబోతున్న సినిమా యాత్ర 2. గతంలో వైఎస్సార్ పాదయాత్ర బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన యాత్ర మంచి సక్సెస్‌ అయ్యింది. ఇప్పుడు 2009 నుంచి 2019 వరకు జరిగిన సంఘటనల ఆధారంగా వస్తున్న సినిమానే యాత్ర 2. ఫిబ్రవరి 8 న యాత్రి 2 రిలీజ్‌ కాబోతుంది. దీంతో చిత్ర యూనిట్‌ మీడియాతో సమావేశమయ్యారు.


వాస్తవ సంఘటనల ఆధారంగా తీసే సినిమాలకు ప్రారంభం , ముగింపు తెలిసి ఉండొచ్చు.. కానీ ఎలా తీస్తున్నామన్నది ఎవ్వరికీ తెలియదు. టీజర్, ట్రైలర్‌లో చూసిన సీన్లు ప్రజలకి తెలిసి ఉండకపోవచ్చు. ఓ చెవిటి అమ్మాయితో ఉన్న సీన్, ఓ అంధుడితో సీన్ ఇవన్నీ బయటి ప్రజలకు తెలియవు. ఇలాంటి ఎన్నో ఎమోషనల్ సీన్స్, ఎన్నో తెలియని అంశాలతో ‘యాత్ర 2’ని తీశాను. ట్రైలర్‌లో చూపించిన ఆ ఎమోషనల్ సీన్లు నిజంగానే జరిగాయా? లేదా? అన్నది పక్కన పెడితే.. ఆ సీన్‌తో ఎమోషన్‌ను జనాలకు కనెక్ట్ చేశామా? అన్నదే సినిమా ఉద్దేశం. ఇందులో ఎవరికీ డప్పు కొట్టలేదు. నమ్మేలా ఉందా? భజనలా అనిపించిందా? అన్నది ఆడియెన్స్‌కి అర్థం అవుతుంది. సినిమాలంటే.. నిజాలైనా చూపించాలి.. నమ్మేలా అయినా చూపించాలి. ఇందులో నిజాలెంత?, కల్పితం ఎంత అంటే.. అన్నంలో నీళ్లలా 1:2 శాతం అని చెప్పలేం. మమ్ముట్టి గారు చేసిన ఆ మూగమ్మాయి సీన్ నిజమా? అంటే నేను చెప్పలేను..కానీ ఆ పాత్ర సోల్, ఎమోషన్‌ మాత్రం నిజం’ అని అన్నారు. చిత్ర దర్శకుడు మహి వి రాఘవ.


ఈ చిత్రంలో వైఎస్ జగన్‌ పాత్రలో జీవా కనిపించబోతున్నారు. జగన్‌ రెడ్డి పాత్రలో నటించడానికి యూట్యూబ్‌లో సీఎం జగన్‌ బాడీలాంగ్వేజ్, మాట్లాడేతీరు, నడిచే విధానం బాగా అబ్జర్వ్ చేస నటించామన్నారు.ఈ పాత్రకు నన్ను ఓకే చేయడానికే చాలా టైం తీసుకున్నారు. ఇక షాట్ ఓకే చెప్పడంతో నాకు పెద్ద రిలీఫ్‌లా అనిపించింది. నేను జగన్ మోహన్ రెడ్డి గారిలానే కనిపిస్తున్నానని అప్పుడే నాకు అర్థమైంది. ఆ తరువాత నేను మానిటర్ కూడా చూడలేదు. ప్రతిపక్షం నుంచి ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చాయా? అని మమ్ముట్టి గారిని అడిగాను. మనం యాక్టర్స్.. ఇది క్రియేటివ్ స్పేస్.. ఇది కేవలం సినిమాలనే చూడు అని ఆయన చెప్పారు. చూడు నాన్నా అనే పాట చిత్రీకరిస్తున్నప్పుడు చాలా ఎమోషన్‌కు లోనయ్యాను’ అని అన్నారు జీవా.


ఇక్కడికి వచ్చేవరకు తెలుగు భాష గురించి నాకు తెలియదు. ఆంధ్రా పాలిటిక్స్‌ గురించి నాకు అస్సలు తెలియవదు కానీ సీఎం జగన్‌ గురించి తెలుసన్నారు వైఎస్‌ భారతీ క్యారెక్టర్‌ పోషించిన కేతకి నారాయణ్. భారతి గారికి ఓ ఇమేజ్ ఉంది. ఆమె గురించి ఎక్కువగా తెలుసుకున్నాను. పాత్రలోని ఇంటెన్సిటీ నాకు అర్థమైంది’అన్నారు కేతకినారాయన్‌.

Related Posts