సోలో బాయ్‌ గా బిగ్‌బాస్‌ గౌతమ్‌ కృష్ణ

ఆశాకవీధిలో సినిమాలో రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రను పోషించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు గౌతమ్‌ కృష్ణ. ఆ తర్వాత బిగ్‌బాస్‌ 7 లో ఎంటరయి ప్రతీ తెలుగింటికీ చేరువయ్యాడు. ఇప్పుడు సోలోబోయ్‌ అంటూ రాబోతున్నాడు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ వేడుక ఈ నెల 7వ తేదీన జరిగింది.


కోవిడ్ టైంలో నేను బట్టల రామస్వామి బయోపిక్ అనే సినిమా తీశాను. కోవిడ్ పాండమిక్ టైం లో ఓటిటి ద్వారా ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం. తర్వాత ఒక మంచి కథ కోసం ఎదురు చూస్తున్న టైం లో ఈ కథ నచ్చి మీ ముందుకు తీసుకుని వచ్చాం. ఈ జెనరేషన్ ఆడియెన్స్ చూడాల్సిన సినిమా. అన్నారు సెవెన్ హిల్స్ సతీష్.
గతంలో ఆకాశవీధిలో చేసినప్పుడు నటుడిగా మంచి గుర్తింపు వచ్చంది. తర్వాత వేరే కథలు వింటున్నప్పుడు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. జనాలు నన్ను బాగా ఆదరించారు. ఈ రోజు మా సినిమా “సోలో బాయ్” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కావడం హ్యాపీగా ఉంది అన్నారు హీరో గౌతమ్‌ కృష్ణ.
డైరెక్టర్ పి. నవీన్ కుమార్ గారు మాట్లాడుతూ – యూత్ కి ఫామిలీ ఆడియన్స్ కి అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం తప్పకుండ అలరిస్తుంది. అన్నారు.

Related Posts