అజయ్ దేవగణ్ బర్త్ డే స్పెషల్ గా ‘మైదాన్‘ ఫైనల్ ట్రైలర్

బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగణ్ లేటెస్ట్ మూవీ ‘మైదాన్‘. భారతదేశం మాజీ ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితకథ ఆధారంగా ఈ చిత్రాన్ని అమిత్ రవీంద్రనాథ్ శర్మ తెరకెక్కించారు. జీ స్టూడియోస్ తో కలిసి బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో అజయ్ కి జోడీగా ప్రియమణి నటించింది. మరో ఇతర ప్రధాన పాత్రలో గజరాజ్ రావు కనిపించనున్నాడు.

ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. రంజాన్ కానుకగా ఏప్రిల్ 10న ‘మైదాన్‘ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ కి మంచి అప్లాజ్ రాగా.. ఈరోజు (ఏప్రిల్ 2) అజయ్ దేవగణ్ బర్త్ డే స్పెషల్ గా ‘మైదాన్‘ ఫైనల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. భారతదేశంలో ఫుట్ బాల్ టీమ్ తయారు చేయడానికి కోచ్ రహీమ్ ఎలాంటి అవరోధాలు ఎదుర్కొన్నారు అనేది ఈ ట్రైలర్ లో చూపించారు.

Related Posts