రణ్‌వీర్ డీప్ ఫేక్ వీడియో వైరల్.. పోలీస్ కంప్లైంట్ చేసిన నటుడు

‘ఫ్రెండ్స్, బివేర్ ఆఫ్ డీప్ ఫేక్స్’ అంటూ ట్వీట్ చేశాడు బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్. ఈమధ్య కాలంలో డీప్ ఫేక్ వీడియోస్ సెలబ్రిటీలకు కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటిలెజెన్స్ తో తారల వీడియోలను తారుమారు చేస్తున్నారు కొంతమంది ఆకతాయిలు. ఆమధ్య రష్మిక కు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో సృష్టించిన దుమారం గురించి తెలిసిందే.

లేటెస్ట్ గా రణ్ వీర్ సింగ్ డీప్ ఫేక్ వీడియో పొలిటికల్ సర్కిల్స్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం.. రణ్ వీర్ సింగ్ మన ప్రధాన మంత్రి మోదీని తిడుతున్నట్టు సర్క్యులేట్ అవుతోన్న డీప్ ఫేక్ వీడియో కారణం. రణ్ వీర్ వాయిస్ ను ఏ.ఐ. తో మార్చేసి.. ప్రధాని ని తిట్టినట్టు వీడియోని విడుదల చేశారు.

ఆకాతాయిలే. ఇది రణ్‌వీర్ సింగ్ వరకూ వెళ్లింది. దీంతో.. సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోపై క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు.. అందరూ ఇలాంటి వీడియోలతో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. పనిలో పనిగా ఈ వీడియోని సృష్టించిన వారిపై పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు.

Related Posts