డేటింగ్ కి కొత్త అర్థం చెప్పిన ఉన్ని ముకుందన్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ చేసేటప్పుడు పరభాషలలోని హీరోలను తీసుకొస్తుంటారు. అలా.. అనుష్క ‘భాగమతి‘లోనూ, సమంత ‘యశోద‘లోనూ నటించిన మలయాళీ కథానాయకుడు ఉన్నిముకుందన్. ఒకవిధంగా ఈ రెండు సినిమాలకంటే ముందే ఎన్టీఆర్ ‘జనతాగ్యారేజ్‘లో నటించాడు ఉన్ని ముకుందన్.

మలయాళం యువ కథానాయకుల్లో మంచి అందగాడైన ఉన్ని ముకుందన్ పై రిలేషన్ షిప్స్ విషయంలో రూమర్స్ వస్తూ ఉంటాయి. మాలీవుడ్ స్టార్స్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అయిన ఉన్ని ముకుందన్.. గతంలోనూ చాలామంది కో స్టార్స్ తో డేటింగ్ చేస్తున్నాడనే రూమర్స్ వచ్చాయి. లేటెస్ట్ గా తన సహ నటి అనుశ్రీతో ఉన్ని ముకుందన్ డేటింగ్ లో ఉన్నాడని మాలీవుడ్ కోడై కూస్తుంది.

ఇదే విషయం గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు ఉన్ని ముకుందన్. తనతో నటించే నటీమణులతో.. తనకి లింక్స్ పెడుతూ వార్తలు వస్తూనే ఉంటాయని.. ఇప్పటికే తనతో లింక్ పెట్టిన హీరోయిన్స్ అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయని.. త్వరలోనే అనుశ్రీ పెళ్లి కూడా అయిపోతుందని కామెడీగా తనపై వస్తోన్న డేటింగ్ రూమర్స్ ను కొట్టిపారేశాడు ఉన్ని ముకుందన్. మోహన్ లాల్ ‘12th మ్యాన్‘ చిత్రంలో ఉన్ని ముకుందన్, అనుశ్రీ కలిసి నటించారు.

Related Posts