‘విశ్వంభర‘.. ఫుల్ యాక్షన్ మోడ్ లో మెగాస్టార్

వింటేజ్ మెగాస్టార్ ను మళ్లీ ప్రేక్షకుల ముందు ఆవిష్కరించేందుకు ‘విశ్వంభర‘తో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు యంగ్ డైరెక్టర్ వశిష్ట. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ సినిమాలో చిరంజీవి పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయట. తన మార్క్ కామెడీని హైలైట్ చేస్తూనే.. ఈ మూవీలో మెగాస్టార్ చేసే యాక్షన్ హై ఇంటెన్స్ గా ఉంటుందని చెబుతున్నారు మేకర్స్.

ఇప్పటికే చాలాభాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ‘విశ్వంభర‘ లేటెస్ట్ గా ఓ హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ను మొదలుపెట్టుకుంది. ఫైట్ మాస్టర్స్ ద్వయం రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ ఫైట్ ను చిత్రీకరిస్తున్నారట. ‘విశ్వంభర‘ ఈ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ గా ఉండబోతున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్.

‘విశ్వంభర‘ చిత్రంలో చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తుంది. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెళ్లుగా ముగ్గురు, నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారనే ప్రచారం ఉంది. ఆస్కార్ విజేత కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ మూవీకి చోటా కె.నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. వచ్చే సంక్రాంతి కానుకగా 2025, జనవరి 10న ‘విశ్వంభర‘ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts