నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా వీర సింహారెడ్డి. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కాబోతోంది. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది. మైత్రీ మూవీస్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రంతో భారీ ప్రమోషన్స్ చేయకుండానే బాలయ్య ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.

అయితే అతని దూకుడు డిఫరెంట్ గా ఉంది. ఒక్కో అప్డేట్ తో ఒక్కో ప్రాంతాన్ని కవర్ చేస్తూ ఇన్ డైరెక్ట్ గా ప్రమోషన్స్ ను కూడా పీక్స్ లో ఉంచుతున్నాడు. ఈ ప్లాన్ ఇతర టీమ్స్ వేయలేక ఎంత ప్రమోషన్స్ చేసినా వీరసింహారెడ్డి లాంటి మైలేజ్ రావడం లేదంటున్నారు. మరి బాలయ్య ప్లాన్ ఏంటీ..? ప్రమోషన్స్ పరంగా ఎలాంటి వైవిధ్యం చూపిస్తున్నాడు..?


సినిమాకు సంబంధించి ఏం చేసినా జనాన్ని అట్రాక్ట్ చేయడం ఇంపార్టెంట్. ఒకప్పుడు విడుదల తర్వాత ఆకట్టుకుంటే ఓకే. బట్ ఇప్పుడు అనౌన్స్ మెంట్ నుంచి ఎండ్ కార్డ్ పడే వరకూ ఏదో రకంగా జనంలో ఉండాలి. లేదంటే ఎంత పెద్ద స్టార్ అయినా ఆడియన్స్ ఆ వైపు అట్రాక్ట్ కావడం లేదు. అఫ్ కోర్స్ బాలయ్య లాంటి స్టార్ కు మరీ ఆ సమస్య లేదు. అయినా ప్రమోషన్స్ చేస్తే అంచనాలు పెంచడం.. వాటిని అందుకుంటే బ్లాక్ బస్టర్ కొట్టడం ఈజీ అవుతుంది.

అందుకే వీరసింహారెడ్డి విషయంలోనూ అదే ఫాలో అవుతున్నారు. ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేయడానికి కర్నూలు టౌన్ ను సెలెక్ట్ చేసుకున్నారు. బాలయ్య అక్కడికి వస్తున్నాడని తెలిసి జనం భారీగా వచ్చారు. అక్కడ కొండారెడ్డి బురుజు నుంచి టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఓ రకంగా ప్రమోషన్స్ ఇక్కడే స్టార్ట్ అయ్యాయి. రీసెంట్ గా రెండు మూడు పాటలు విడుదల చేసినప్పుడూ ఇదే ఫాలో అయ్యారు. సంధ్య థియేటర్ లో మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అనే పాటను విడుదల చేసి భారీ క్రౌడ్ ను ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు ట్రైలర్ కోసం మరో ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నారు.

ఈ మంగళవారం రోజు మరో సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. తర్వాత ఈ నెల 6న ట్రైలర్ ను ఒంగోలులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు గోపీచంద్ ది ఒంగోలే. అతని గత సినిమా క్రాక్ కూడా ఒంగోలు బ్యాక్ డ్రాప్ లోనే సాగింది.

ఇప్పుడు ఆ ప్రాంతంలో ట్రైలర్ లాంచింగ్ అంటే అభిమానులు ఏ రేంజ్ ల వస్తారో ఊహించొచ్చు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా మరో ప్రాంతంలో చేస్తే ఓవరాల్ గా రెండు స్టేట్స్ లో ప్రమోషన్స్ తెలియకుండానే ముగిసిపోతాయి. ఇక ఈ మూవీకి వస్తోన్న బజ్ చూసి.. అదే టైమ్ కు రీలీజ్ కాబోతోన్న ఇతర సినిమాలు తలపట్టుకున్నాయట. ఆ స్థాయిలో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయాలంటే మనమేం చేయాలి అని..