ఎన్టీఆర్ పై అసహనంగా ఉన్న అభిమానులు

ఎంత స్టామినా ఉన్న హీరో అయినా స్టార్డమ్ రేస్ లో వెనకబడితే ఫ్యాన్స్ కూడా ఫీలవుతారు. ముఖ్యంగా ప్లానింగ్ పర్ఫెక్ట్ గా లేకపోతే.. ఇతర హీరోలతో పోటీలో చాలా చాలా వెనకబడిపోతారు. ఈ విషయంలో అందరికంటే ముందున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. 2018లో అరవింద సమేత మూవీ వచ్చింది. 2022లో ఆర్ఆర్ఆర్ వచ్చింది. అంటే నాలుగేళ్ల గ్యాప్.

పోనీ కరోనా, రాజమౌళి కారణంగాఈ మూవీని వదిలేసినా.. ఇప్పుడు కొరటాల శివ సినిమాను కూడా అంతే లేట్ చేస్తున్నాడు. ఇక లేటెస్ట్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ చూసిన తర్వాత అభిమానులంతా అసహనంగా ఫీలవుతున్నారు. మరి కొరటాల అన్ని రోజులు పాటు ఏం తీస్తాడో కానీ.. ఇప్పటికే చాలా లేట్ అయినా ఈ మూవీ రిలీజ్ డేట్ ఇండస్ట్రీని కూడా ఆశ్చర్యపరుస్తోంది.


యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తెలుగులో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా తిరుగులేని పేరున్న హీరో. అయితే స్టార్ హీరోల లిస్ట్ లో తెలుగు నుంచి టాప్ ఫైవ్ తీసినప్పుడు ఆ టాలెంట్ కు తగ్గ ప్లేస్ లో అయితే లేడు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ప్యాన్ ఇండియా మానియా నడుస్తోంది. ఆ మానియాలోకి ఆర్ఆర్ఆర్ తో ఎంటర్ అయ్యాడు ఎన్టీఆర్. ఈ మూవీ ఇచ్చిన క్రేజ్ ను క్యాష్‌ చేసుకోవడంలోనూ అతను వెనకబడుతున్నాడు. ఆల్రెడీ ఆర్ఆర్ఆర్ లో నటించిన రామ్ చరణ్ వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్నాడు.

శంకర్ తో పాటు బుచ్చిబాబుతోనూ రీసెంట్ గా ఓ మూవీ ఓకే అయింది. మరోవైపు కన్నడ దర్శకుడు నర్తన్ తో ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయింది. ఇటు చూస్తే ఎన్టీఆర్ మాత్రం ఇంకా కొరటాల శివను పట్టుకుని ఆగిపోయాడు. పోనీ ఇదైనా కాస్త వేగంగా సాగుతుందా అంటే అదీ లేదు. కథ కోసం ఇప్పటికే ఆరు నెలలకు పైగా టైమ్ తీసుకున్నారు. ఇక ఈ జనవరి షూటింగ్ స్టార్ట్ చేసి ఈ యేడాదే దసరాకు విడుదల చేస్తారు అని చాలామంది భావించారు. బట్ ఈ విషయంలో కూడా ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు కొరటాల శివ. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో స్టార్ట్ చేయబోతున్నారు.

దీంతో వచ్చే యేడాది సంక్రంతికైనా వస్తుందనుకుంటే అదీ లేదు. ఏకంగా వచ్చే యేడాది ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అంటే యేడాదికి పై మాటే. మరి ఇన్ని రోజుల పాటు కొరటాల ఏం చెక్కుతాడో కానీ..ఈ గ్యాప్ లో ఇతర హీరోలు ఖచ్చితంగా రెండు సినిమాలతో అయినా వస్తారు. అవి బ్లాక్ బస్టర్ అయితే ఖచ్చితంగా రేస్ లో ఎన్టీఆర్ వెనకబడిపోతాడు. ఏదేమైనా కొరటాల శివ యేడాది పాట ఏం చెక్కుతాడో కానీ ఈ డేట్ విన్న ఫ్యాన్స్ అంతా తెగ ఫీలవుతున్నారు పాపం.

Related Posts