‘కల్కి’లో కొనసాగుతున్న తారల పరంపర! కీలక పాత్రలో ఎన్టీఆర్?

‘సలార్’ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న చిత్రం ‘కల్కి 2898 ఎ.డి’. ముందు నుంచీ ఈచిత్రాన్ని పాన్ ఇండియన్ మూవీగా కాకుండా పాన్ వరల్డ్ మూవీగా ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. హాలీవుడ్ లోని అతిపెద్ద సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయట. అందుకోసం వరల్డ్ వైడ్ గా ఉన్న బెస్ట్ విజువల్స్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్స్ ఈ సినిమాకి వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాకోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్.

ఇప్పటికే ‘కల్కి’ చిత్రంలో కాస్టింగ్ మామూలుగా లేదు. రెబెల్ స్టార్ ప్రభాస్ మెయిన్ లీడ్ కాగా.. అందుకు దీటైన సుందరాంగిగా దీపిక నటిస్తుంది. ఇంకా.. లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి వారు ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో భాగస్వాములయ్యారు. వీరే కాకుండా దిశా పఠాని వంటి బీటౌన్ బ్యూటీస్ ని ఈ సినిమాలో పార్ట్ చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ తారల పరంపర ఇక్కడితో ఆగదట. మరెంతోమంది క్రేజీ స్టార్స్ ‘కల్కి’లో కనిపించబోతున్నారనే టాక్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా స్ప్రెడ్ అవుతోంది.

‘కల్కి’ చిత్రంలో కేమియోస్ కి కొదవే ఉండదట. ఈ మూవీలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ వంటి వారు కేమియోస్ లో మురిపించబోతున్నారనే ప్రచారం ఆమధ్య సాగింది. వీరితో పాటు.. లేటెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని కూడా ‘కల్కి 2898 ఎ.డి’లో దర్శనమిస్తారనే టాక్ అయితే అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమాలో పరశురాముడిగా కొన్ని నిమిషాల పాటు తారక్ దర్శనమివ్వబోతున్నాడట. అలాగే.. క్లైమాక్స్ కి ముందు వచ్చే కీలక సన్నివేశంలో కృపాచార్యుడిగా నాని కనిపిస్తాడంటున్నారు. మొత్తంమీద.. మే 9న విడుదలకాబోతున్న ‘కల్కి’లో ఎంతమంది అతిథులుగా మెరవబోతున్నారనే దానిపై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.

Related Posts