కొత్త చరిత్ర సృష్టించిన ‘హనుమాన్’

సంక్రాంతి బరిలో చిన్న సినిమాగా విడుదలై అతిపెద్ద విజయాన్ని సాధించిన చిత్రం ‘హనుమాన్’. అసలు సిసలు ఇండియన్ సూపర్ హీరో మూవీగా ఆడియన్స్ ముందుకు వచ్చిన ‘హనుమాన్’ బాక్సాఫీస్ ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకూ ఈ సినిమాకి కోటి టికెట్స్ తెగాయట. అంటే.. కోటి మంది ఈ సినిమాని థియేటర్లలో చూశారన్నమాట. ఇలాంటి మిడ్ రేంజ్ మూవీకి ఇదో రేర్ ఫీట్ అని చెప్పొచ్చు.

ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల వసూళ్ల మార్కుకు చేరువలో ఉన్న ‘హనుమాన్’ ఓవర్సీస్ లో 5 మిలియన్ డాలర్స్ మార్కును దాటేసింది. మరోవైపు ఈ చిత్రం మైత్రీ మూవీ మేకర్స్ కి కాసులు కురిపించిందని చెప్పొచ్చు. ఒకవైపు తమ ప్రొడక్షన్ లో బడా హిట్స్ అందుకుంటోన్న మైత్రీ సంస్థ.. డిస్ట్రిబ్యూటర్స్ గానూ ‘సలార్’ తర్వాత ‘హనుమాన్’తో మరో భారీ విజయాన్నందుకుంది. ఈ సినిమాని కేవలం ఏడున్నర కోట్లకు కొన్న మైత్రీ సంస్థ.. ఇప్పటికే 30 కోట్లకు పైగా షేర్ ను సాధించింది. మూడో వారంలోనూ ‘హనుమాన్’ వసూళ్ల వర్షం కొనసాగుతూనే ఉంది.

Related Posts