నెట్ ఫ్లిక్స్ నుంచి జాక్ పాట్ కొట్టేసిన నాని!

నేచురల్ స్టార్ నానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉంది. పాన్ ఇండియా లెవెల్ లో పెద్దగా సినిమాలు చేయకపోయినా.. తన చిత్రాల అనువాదాలతో నార్త్ లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక.. నాని-వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన ‘అంటే.. సుందరానికి’ థియేట్రికల్ గా అంతంత మాత్రం అనిపించుకున్నా.. ఓటీటీలో మాత్రం వీర లెవెల్ లో కుమ్మేసింది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోన్న ‘అంటే సుందరానికి’ అన్ని భాషల ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

అదే ఇప్పుడు నాని-వివేక్ ఆత్రేయ కాంబోలో రూపొందుతోన్న అప్ కమింగ్ మూవీ ‘సరిపోదా శనివారం’కి ప్లస్ అయ్యింది. ఈ చిత్రం ప్రొడక్షన్ లో ఉండగానే.. డిజిటల్ రైట్స్ ను రూ.45 కోట్లకు దక్కించుకుందట నెట్ ఫ్లిక్స్. ఒకవిధంగా నాని కెరీర్ లో ఇదే హయ్యస్ట్ డిజిటల్ డీల్. అలాగే ఈ సినిమాకి సంబంధించి థియేట్రికల్ రైట్స్ ను దిల్ రాజు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మొత్తంగా.. విడుదలకు ముందే సేఫ్ జోన్ లోకి వెళ్లిన ప్రాజెక్ట్ గా నాని ‘సరిపోదా శనివారం’ మిగలబోతుంది. డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నానికి జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తుంది. విలన్ గా ఎస్.జె.సూర్య కనిపించబోతున్నాడు.

Related Posts