ఆకట్టుకుంటోన్న ‘హరోం హర’ టైటిల్ సాంగ్

సినిమా సినిమాకి విలక్షణమైన కథలతో ప్రయోగాలు చేయడానికి ఇష్టపడే హీరోల్లో సుధీర్ బాబు ఒకడు. లేటెస్ట్ గా ‘హరోం హర’ అంటూ ఓ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు. ఇప్పటివరకూ విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ విభిన్నమైన కథాంశంతో ‘హరోం హర’ రాబోతున్నట్టు అర్థమవుతోంది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘హరోం హరోం హర’ అంటూ సాగే టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు.

‘హరోం హర’ టైటిల్ ఎంత పవర్ ఫుల్ గా ఉందో.. ఈ పాట కూడా అంతే ఆకట్టుకుంటోంది. సంస్కృత పదాలతో కళ్యాణ్ చక్రవర్తి రాసిన ఈ గీతాన్ని అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. చైతన్య భరద్వాజ్ స్వరాలు సమకూర్చాడు. ఈ పాటలో సుధీర్ బాబు ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నాడు. ‘హరోం హర’.. ‘ది రివోల్ట్’ అనే ట్యాగ్ లైన్ తో రాబోతున్న ఈ సినిమాలో సుధీర్ బాబు మేకోవర్ సరికొత్తగా ఉంది. మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. కీలక పాత్రల్లో సునీల్, జయప్రకాష్ కనిపించనున్నారు. సుమంత్ జి.నాయుడు నిర్మాణంలో జ్ఞానసాగర్‌ ద్వారక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో ‘హరోం హర’ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts