‘నాటు నాటు’ పాటకు 104 ఏళ్లు.. అసలు రహస్యమేంటి?

రాజమౌళి – రామారావు – రామ్ చరణ్. ఈ ముగ్గురు పేర్లలోని మొదటి అక్షరాలతో ప్రచారంలోకి వచ్చిన టైటిల్ ‘ఆర్.ఆర్.ఆర్’. ఆ తర్వాత అదే ఈ చిత్రానికి టైటిల్ గా ఖరారయ్యింది. నిజాం నిరంకుశ పాలనను ఎండగట్టిన కొమరం భీమ్.. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన అల్లూరి సీతారామరాజుల కథాంశంతో.. ఫిక్షనల్ స్టోరీగా దర్శకధీరుడు రాజమౌళి ‘రౌద్రం రణం రుధిరం’ను తీర్చిదిద్దాడు.

‘ఆర్.ఆర్.ఆర్’ యావత్ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేసింది. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు స్టెప్పేయని సెలబ్రిటీ ఉండడమే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగరీలో ‘నాటు నాటు’ ఆస్కార్ గెలుచుకుంది. అంతటి సంచలనం సృష్టించిన ‘నాటు నాటు’ పాట గురించి ‘ఆర్.ఆర్.ఆర్’ టీమ్ వాలెంటైన్స్ డే స్పెషల్ గా ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది.

సరిగ్గా 104 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్, రామ్ చరణ్ ‘నాటు నాటు’ పాటకు స్టెప్పేశారనేది ఆ మెస్సేజ్ సారాంశం. ‘ఆర్.ఆర్.ఆర్’ వచ్చి రెండేళ్లేగా అవుతోంది. మరి.. 104 ఏళ్ల క్రితం తారక్, చెర్రీలు ఈ పాటకు స్టెప్పులేయడం ఏంటి? అనే అనుమానం కలగక మానదు. అయితే.. ‘ఆర్.ఆర్.ఆర్’ కథ 1920లో సాగుతుందని టైటిల్ లోగోలో కూడా వేశారు. ఇక.. 1920 వాలెంటైన్స్ డే స్పెషల్ గానే ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట వస్తుంది. అంటే.. సరిగ్గా 104 ఏళ్ల క్రితం జరిగిన వాలెంటైన్స్ డే కి ‘నాటు నాటు’ పాటకు వీరిద్దరూ స్టెప్పులేశారనేది ‘ఆర్.ఆర్.ఆర్’ టీమ్ సందేశంలోని దాగున్న అర్థం.

Related Posts