మురుగదాస్ కొత్త చిత్రం మొదలైంది

మురుగదాస్.. సౌతిండియాలోని ఒన్ ఆఫ్ ది స్టార్ డైరెక్టర్స్ లో ఒకడు. వెండితెరపై భారీతనానికి, సందేశాత్మక కథాంశాలకు పెద్ద పీట వేసే ఈ డైరెక్టర్ కొన్నేళ్లుగా సరైన హిట్ కు దూరమయ్యాడు. రజనీకాంత్ తో ‘దర్బార్’ తీసిన తర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని ఇప్పుడు కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టాడు. కోలీవుడ్ రైజింగ్ స్టార్ శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్నాడు. శివకార్తికేయన్ 23వ చిత్రమిది. ఈ చిత్రంలో ‘సప్తసాగరాలు దాటి’ ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా.. ఈ సినిమా ముహూర్తాన్ని జరుపుకుంది. ఈ సినిమాకి అనిరుధ్ స్వరాలు సమకూరుస్తున్నాడు. మలయాళీ స్టార్ మోహన్‌ లాల్‌, బాలీవుడ్ హీరో విద్యుత్‌ జమ్వాల్ ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫుల్ లెన్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతుందట.

Related Posts