ఫస్ట్ డే మహేష్ బాబుదే.. రికార్డ్ కలెక్షన్స్

స్టార్ హీరోల సినిమాలకు ఉండే అడ్వాంటేజ్ వేరే ఉంటుంది. సినిమా ఎలా ఉన్నా.. ఓపెనింగ్స్ అదిరిపోతాయి. ఓపెనింగ్స్ తోనే కొన్నవాళ్లు.. కొన్ని ఏరియాల్లో గట్టెక్కే పరిస్థితి కూడా ఉంటుంది. నిన్న విడుదలైన సర్కారువారి పాట కూడా అలాగే భారీ ఓపెనింగ్స్ తో సత్తా చాటింది. సినిమాకు వచ్చిన టాక్ తో సంబంధం లేకుండా ఈ రేంజ్ లో కలెక్షన్స్ సాధించడం చూసి టాలీవుడ్ కూడా ఆశ్చర్యపోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా వచ్చిన సర్కారువారి పాట బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. సినిమాకు టాక్స్ మిక్స్ డ్ గా ఉన్నా.. కలెక్షన్స్ కాన్ స్టంట్ గా ఉన్నాయి. ఓ ప్రాంతీయ సినిమాగా వచ్చిన ఈ చిత్రం ఏకంగా ఫస్ట్ డే కలెక్షన్స్ లో కొత్త రికార్డ్ నే క్రియేట్ చేసింది. పరశురామ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ బడాబాబులు బ్యాంక్ లను మోసం చేయడం.. బ్యాంక్ లు సామాన్యులున ఇబ్బంది పెట్టడం అనే పాయింట్ తో అల్లుకున్న కథగా వచ్చింది. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్ గా, సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా సాగడంతో అటు మాస్ ను ఇటు క్లాస్ ను ఒకేసారి ఆకట్టుకుంటోందీ చిత్రం.

కొన్నాళ్లుగా మహేష్ బాబు ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధిస్తోంది. ఆ ట్రెండ్ ను సర్కారువారి పాట కొనసాగిస్తుందనే చెప్పాలి. చాలా రోజుల తర్వాత మహేష్ బాబు.. మాసివ్ గా కనిపించాడు. ఎంటర్టైన్మెంట్ లో తనే ప్రధాన పాత్ర తీసుకున్నాడు. తన టైమింగ్, యాక్టింగ్ కు ఎంటైర్ ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. అటు కీర్తి సురేష్, మహేష్ ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కవుట్ అయిందనే చెప్పాలి. ఇవన్నీ కలిసే సినిమాలోని కొన్ని మైనస్ లను అధిగమించి ఈ రేంజ్ కలెక్షన్స్ ను కట్టబెట్టాయంటున్నారు.
సర్కారువారి పాట ఓవర్శీస్ లో మొదటి రోజుకే ఒన్ మిలియన్ క్లబ్ లో చేరింది. నైజాంగ్ లో ఏకంగా 12కోట్లు కలెక్ట్ చేసి ఇక్కడ మహేష్ కు ఉన్న క్రేజ్ ను మరోసారి ప్రూవ్ చేసింది. యూఏ లో దాదాపు నాలుగు కోట్లు, ఈస్ట్ లో మూడు కోట్లకు పైగా, వెస్ట్ లో మూడు కోట్లు, గుంటూర్ లో రికార్డ్ స్థాయిలో ఐదు కోట్ల 83లక్షలు వసూలు చేసి సూపర్ స్టార్ స్టామినాను చాటింది. కృష్ణాలో రెండు కోట్ల 58లక్షలు, నెల్లూర్ లో 1కోటి 56లక్షలతో సత్తా చాటిన సర్కారువారి పాట మొదటి రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి 36కోట్ల 89లక్షలు కలెక్షన్స్ సాధించి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. మరి ఈ హవా ఇలానే కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఇవాళ్టి కలెక్షన్స్ ను బట్టి తేలిపోతుంది.

Related Posts