ఆర్ఆర్ఆర్ పది రోజుల కలెక్షన్స్ .. వెయ్యి కోట్లు సాధిస్తుందా..?

బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ ప్రభంజనం కంటిన్యూ అవుతోంది. విడుదలైన అన్ని బాషల్లోనూ భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే కేవలం పది రోజుల్లోనే బాహుబలి పార్ట్ రికార్డ్స్ ని బ్రేక్ చేసేసింది. మిగతా బాషల్లోనూ కలెక్షన్లు ఇప్పటికీ స్టడీగా ఉన్నాయి. మొత్తంగా పది రోజుల్లోనే 850ల కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి వెయ్యి కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతోంది ట్రిపుల్ ఆర్.
ట్రిపుల్ ఆర్ మానియా ధియేటర్లలో కంటిన్యూ అవుతోంది. స్టోరీ పరంగా మైనస్ లు ఉన్నా…. టేకింగ్, యాక్షన్ ఎపిసోడ్స్, పెర్ఫార్మెన్స్, విజువల్ ఎఫెక్ట్స్ వల్ల సినిమాకి అన్ని బాషల ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. మొదటి వారంలోనే వరల్డ్ వైడ్ గా ఏడు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం ఇప్పుడు పది రోజుల్లో దాదాపు 900ల కోట్లకు దగ్గరకి చెరుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ కొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. కేవలం పది రోజుల్లోనే గత రికార్డ్ అయిన బాహుబలి పార్ట్ 2 రికార్డ్స్ ని బ్రేక్ చేసేసింది. పది రోజుల్లో నైజాంలో 97 కోట్ల షేర్ సాధించి, ఇవాళో రేపు వంద కోట్ల క్లబ్ లో అడుగుపెట్టబోతుంది. అంటే గ్రాస్ కలెక్షన్లలో చూస్తే 150 కోట్లకు పైనే ఉంటుంది. ఇది మళ్ళీ రాజమౌళి మాత్రమే బ్రేక్ చేయగల రికార్డ్ అని చెప్పాలి. ఇక రాయల సీమలో పది రోజుల్లోనే 40 కోట్ల షేర్ సాధించి రికార్డ్ సాధించింది. ఉత్తరాంధ్రలో 30 కోట్ల షేర్ వచ్చింది. మిగతా ఏరియాల్లోనూ ట్రేడ్ పండితులు కూడా ఊహించని రికార్డ్స్ తెలుగు రాష్ట్రాల్లో నమోదయ్యాయి.
ఓవర్సీస్ మార్కెట్ లో ఆర్ఆర్ఆర్ హవా ఇంకా కంటిన్యూ అవుతోంది. ఒక్క అమెరికాలోనే వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించే దిశగా వెళుతోంది. ఇక తమిళ, మలయాళ, కన్నడలోనూ కలెక్షన్లు బాగున్నాయి. హిందీ మార్కెట్ లో ఇంకా స్ట్రాంగ్ గానే ఉంది. అక్కడ ఇప్పటికే రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మొత్తంగా రెండు వారాల్లో ఆర్ఆర్ఆర్ వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

Related Posts