పొన్నియన్ సెల్వన్ టీజర్ టాక్ ..

పొన్నియన్ సెల్వన్ పొన్నియన్ సెల్వన్1.. మణిరత్నం అత్యంత ప్రిస్టీజియస్ గా రూపొందించిన ప్రాజెక్ట్. తమిళ తెరపై ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంత భారీ తారాగణంతో తెరకెక్కిస్తోన్ని సినిమా. కొన్ని రోజులుగా ఈ మూవీ నుంచి ఒక్కో క్యారెక్టర్ స్టిల్ ను విడుదల చేస్తూ ఆసక్తి పెంచాడు మణిరత్నం. ఈ శుక్రవారం సాయంత్రం చెప్పినట్టుగానే ఆరు గంటలకు అన్ని భాషల టీజర్స్ విడుదల చేశారు. విక్రమ్, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష, జయం రవి, ఐశ్వర్య లక్ష్మి, ప్రకాష్‌ రాజ్, శరత్ కుమార్, పార్తీబన్ వంటి బిగ్ స్టార్స్ అంతా ఉన్నారీ సినిమాలో. అయితే టీజర్ మాత్రం అంచనాలను అందుకుంటుంది అని చెప్పలేం. అందుకు కారణం ఇది హిస్టారికల్ మూవీ కావడం ఒకటైతే.. టీజర్ లోని గ్రాఫిక్‌స్ చాలా నాసిరకంగా ఉన్నాయి.టీజర్ రాగానే మైనస్ లు చెప్పేస్తే కొంతమందికి నచ్చదేమో కానీ.. ఖచ్చితంగా చెబితే ఇది పూర్తిగా తమిళ్ ఫ్లేవర్ తో నిండి ఉన్న సినిమా అని అర్థమౌతోంది. అంటే బాహుబలిలా ఫిక్షన్ కాదు. తమిళనాడులోని చోళ రాజులకు సంబంధించిన కథ. ఇది ఆ ప్రాంతానికే పరిమితమవుతుంది తప్ప యూనివర్సల్ గా యాక్సెప్టెన్సీ కనిపించదు.

పైగా క్యారెక్టర్స్, వాటి క్యారెక్టరైజేషన్స్ అన్నీ కేవలం తమిళులను ప్రతిబింబిస్తున్నాయి తప్ప.. అందరికీ కనెక్ట్ అయ్యేలా లేవు. ఇంకా చెబితే ఈ సినిమాలో ప్రధాన పాత్ర విక్రమ్ చేశాడు. అతని పాత్ర ఐశ్వర్య రాయ్ కోసం పలవరించేదిగా టీజర్ లోనే చూపించాడు. అంటే ఆడదాని బలహీనత వల్ల జరిగే సంగ్రామంగా ఈ చిత్రాన్ని చూడొచ్చు. నిజానికి తమిళనాడులో చోళులపై చాలా గౌరవం కనిపిస్తుంది. అలాగే చోళుల కాలంలో బడుగు, బలహీన వర్గాల వారిని అత్యంత దారుణంగా హింసించారు అని చరిత్ర చెబుతుంది. ఈ కాంట్రాస్ట్ కథలో ఎలాగూ కనిపించదు. కేవలం చోళుల గొప్పతనం మాత్రమే ఆవిష్కృతం అవుతుంది.ఇక గ్రాఫికల్ గా నాసిరకంగా కనిపిస్తుంది. చాలా సన్నివేశాల్లోని విజువల్ ఎఫెక్ట్ ఆర్టిఫిషియల్ గానే కనిపిస్తున్నాయి. మొత్తంగా లైకా ప్రొడక్షన్స్ తో పాటు మణిరత్నం సొంత బ్యానర్ మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ భారీ బడ్జెట్ మూవీ తమిళులకు ఎలాగూ నచ్చుతుంది. కానీ ఇతర భాషల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే అంశాలు కనిపించడం లేదు. ఇక పాత్రలకు తగ్గట్టుగా అందరు నటీనటులకు టీజర్ లో ప్రాధాన్యం ఇచ్చారు. మరి 500కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

Related Posts