‘హరి హర వీరమల్లు‘ నుంచి ఊహించని అప్డేట్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారి నటిస్తున్న చారిత్రక చిత్రం ‘హరి హర వీరమల్లు‘. పేరుకు మొఘలుల కాలంనాటి చారిత్రక కథాంశంతో రూపొందుతోన్నా ఇదొక ఫిక్షనల్ డ్రామా. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎమ్.రత్నం నిర్మాణంలో క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా మొదలైంది. ఇప్పటికే చాలాభాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా షూటింగ్ కి గ్యాప్ వచ్చింది. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ తో బిజీగా ఉండడంతో ‘హరిహర వీరమల్లు’కి విరామం ఇచ్చాడు. అయితే.. ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం కూడా జరిగింది. అలాగే.. ఈ మూవీ నుంచి డైరెక్టర్ గా క్రిష్ తప్పుకున్నాడనే న్యూస్ నెట్టింట జోరుగానే చక్కర్లు కొట్టింది. అయితే.. అవన్నీ నిజం కాదని ఎప్పటికప్పుడు నిర్మాత ఎ.ఎమ్.రత్నం చెబుతూనే ఉన్నారు.

లేటెస్ట్ గా ‘హరి హర వీరమల్లు‘ నుంచి సర్ప్రైజింగ్ అప్డేట్ అందించబోతున్నారు మేకర్స్. మే 2న ఉదయం 9 గంటలకు ఈ చిత్రం నుంచి ‘ధర్మం కోసం యుద్ధం‘ అంటూ ఓ స్పెషల్ అప్డేట్ అందించడానికి రెడీ అవుతోంది టీమ్. అందుకు సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ సినిమాకోసం పవన్ కళ్యాణ్ ఇంకొక 20 రోజులు కాల్షీట్స్ ఇస్తే సరిపోతుందట. ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు‘ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Related Posts