మే నుంచే పట్టాలెక్కనున్న ‘సలార్ 2’?

ప్రభాస్ లోని రెబలిజాన్ని మరోసారి బాక్సాఫీస్ వద్ద చాటిన చిత్రం ‘సలార్’. ‘బాహుబలి’ తర్వాత అసలు సిసలు హిట్ కోసం ఎదురుచూసిన రెబెల్ స్టార్ కి దక్కిన అరుదైన బ్లాక్ బస్టర్ హిట్ ఇది. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘సలార్’ ఆడియన్స్ ను సరికొత్త ప్రపంచానికి తీసుకెళ్లింది. ఇండియన్ స్క్రీన్ పై నెవర్ బిఫోర్ విజువల్ ట్రీట్ ఆవిష్కరించింది.

‘సలార్ 1.. సీజ్ ఫైర్’ హిట్టవ్వడంతో.. ‘సలార్ 2.. శౌర్యంగపర్వం’ ఎప్పుడెప్పుడు మొదలవుతోందా? అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ప్రభాస్ కి ఉన్న కమిట్ మెంట్స్ నేపథ్యంలో ‘సలార్ 2’ సెట్స్ పైకి వెళ్లడానికి కనీసం మరో ఆరు నెలలు పడుతుందనే అంచనాలు మొదలయ్యాయి. అయితే.. అవన్నీ పటాపంచలు చేస్తూ ఈ మే నెల నుంచే ‘సలార్ 2’ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్.

‘సలార్ 1’ చిత్రీకరణ సమయంలోనే ‘సలార్ 2’కి సంబంధించి కొన్ని సన్నివేశాల చిత్రీకరణ పూర్తిచేశారట. అలాగే.. కథ మొత్తం అదే బ్యాక్‌డ్రాప్ తో ఉంటుంది కాబట్టి.. సెట్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి.. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాలనే ప్రయత్నంలో ఉన్నాడట ప్రశాంత్ నీల్. ప్రభాస్ లేని కొన్ని సన్నివేశాలను కూడా తెరకెక్కించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడట. ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చే యేడాది ద్వితియార్థంలో ‘సలార్ 2’ని తీసుకురావాలనే గట్టి ప్రయత్నంలో ఉన్నాడట ప్రశాంత్ నీల్.

Related Posts