మహేష్‌ బాబు త్రివిక్రమ్ అఫీషియల్ గానే చెప్పేశారు..

మహేష్‌ బాబుకొన్నాళ్లుగా వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. కొన్ని యావరేజ్ అనిపించుకున్నా.. కమర్షియల్ గా ఫర్వాలేదనిపిస్తూ ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ గా వచ్చిన సర్కారువారి పాట కూడా కంటెంట్ వీక్ గా ఉన్నా కలెక్షన్స్ ఆకట్టుకున్నాయి. ఈ కారణంగానే సినిమా సినిమాకు మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకోవడం లేదు. ప్రత్యేకంగా ఫలానా సబ్జెక్టే కావాలని పట్టుపట్టడం లేదు. తన వద్దకు వచ్చిన కథ నచ్చితే కమిట్ అయిపోతున్నాడు. అందుకే 12యేళ్ల తర్వాత త్రివిక్రమ్ తో సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ ఇద్దరి కాంబోలో గతంలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. కానీ అవి అప్పట్లో పెద్దగా ఆకట్టుకోలేదు.అల వైకుంఠపురములో అంటూ ఇండస్ట్రీ హిట్ కొట్టినా నెక్ట్స్ మూవీకి చాలా గ్యాప్ తీసుకున్నాడు త్రివిక్రమ్. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయాలి. అనుకోని కారణాలతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.అప్పుడే మహేష్‌ తో మూవీ ఓకే అయింది. కానీ కథ లేదు. ఆ కథ కోసమే ఇన్నాళ్లూ వెయిట్ చేశారు. ఇటు మహేష్‌ ఆ టైమ్ లో సర్కారువారి పాట ఫినిష్‌ చేశాడు. అయితే నిన్నా మొన్నటి వరకూ కూడా ఈ ఇద్దరి కాంబోపై ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ కు తగ్గ కథ ఇంకా సెట్ కాలేదు. అందుకే ఈ ప్రాజెక్ట్ ఆగిపోవచ్చు అంటూ రకరకాల రూమర్స్ వచ్చాయి. ఆ రూమర్స్ కు చెక్ పెడుతూ అఫీషియల్ గా ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది.
త్రివిక్రమ్ సినిమా అంటే ఖచ్చితంగా హారిక హాసిని బ్యానర్లోనే ఉంటుంది కదా..? ఆ బ్యానర్ నుంచే ఈ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. తమన్ మ్యూజిక్ స్టార్ట్ చేశాడు. హీరోయిన్ గా పూజా హెగ్డే అని గతంలోనే ప్రకటించారు. ఇక మరో పాత్రలో సంయుక్త మీనన్ నటించే అవకాశం ఉంది. మహేష్‌ తో పాటు ఓ కీలక పాత్రలో ఉపేంద్ర కూడా నటిస్తాడు అంటున్నారు. ప్రీ ప్రొడక్షన్ పూర్తి కాగానే ఈ ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళుతుందీ చిత్రం. అంటే కేవలం నెల రోజుల్లోనే సెట్స్ పైకి వెళుతుంది. సినిమాను వచ్చే సమ్మర్ లో విడుదల చేస్తారు. సో.. వీరికి సంక్రాంతి ఒత్తిడి ఏం లేదు. ఈ సారి ఎలాంటి కథతో వస్తున్నారు అనేది ఇంకా తెలియదు కానీ.. మొత్తంగా క్రేజీ కాంబినేషన్ నుంచి కీలకమైన అప్డేట్ వచ్చేసింది. ఇక ఫ్యాన్స్ అంతా సమ్మర్ కోసం చూసుకోవాల్సిందే.

Related Posts