మెగాస్టార్ గాడ్ ఫాదర్ రిలీజ్ డేట్ Telugu70mm ఎక్స్ క్లూజివ్

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య రిజల్ట్ ను పట్టించుకోకుండా తర్వాతి ప్రాజెక్ట్స్ గురించి ఆలోచిస్తున్నాడు. సినిమా ఫ్లాప్ అనిపించుకున్న తర్వాత ఏ నటుడైనా ఆత్మపరిశీలన చేసుకుంటాడు. కానీ ఆ దశను ఎప్పుడో దాటేసిన చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలతో మరింత బిజీ అయిపోయాడు. ప్రస్తుతం వెకేషన్ లోఉన్న మెగాస్టార్.. వచ్చిన తర్వాత గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తాడు. ఇప్పటికే గాడ్ ఫాదర్ మేజర్ పార్ట్ చిత్రీకరణ పూర్తయింది. ఇంకేదైనా వర్క్ మిగిలి ఉంటే డైరెక్టర్ ఇప్పుడు ఫినిష్ చేస్తున్నాడు. చిరంజీవి వెకేషన్ నుంచి రాగానే.. ఆయన పార్ట్ కంప్లీట్ అవుతుంది. మరోవైపు ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఎప్పుడో స్టార్ట్ అయింది. దీంతో ఇక రిలీజ్ డేట్ ను ప్లాన్ చేసుకున్నారు.

మళయాల బ్లాక్ బస్టర్ లూసీఫర్ రీమేక్ గా వస్తోన్న చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా కోసం చాలామంది దర్శకులను ప్రయత్నించిన తర్వాత చివరికి తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజాను తీసుకున్నారు. అతను ఇంతకు తనీ ఒరువన్ తో తమిళ్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమానే రామ్ చరణ్ ధృవగా రీమేక్ చేశాడు. దీంతో మోహన్ రాజా వర్కింగ్ స్టైల్ తో పాటు అతను చేసిన మార్పులు కూడా నచ్చడంతో చిరు ఓకే చెప్పాడు. ఓ బెస్ట్ క్రూ తో మొదలైన ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. చిరంజీవితో పాటు నయనతార కూడా ఉంది. సల్మాన్ ఖాన్, పూరీ జగన్నాథ్ లు చిన్న పాత్రలు కూడా చేశారు. ఓ రకంగా చూస్తే ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిన సినిమా.. లూసీఫర్ కు రీమేక్.. దీనికి మెగాస్టార్ స్వాగ్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి.. తెలుగులోనూ అదే రేంజ్ హిట్ కన్ఫార్మ్ అనుకోవచ్చు. ఆ నమ్మకంతోనే గాడ్ ఫాదర్ ను ఆగస్ట్ 11న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. యస్.. ఈ మూవీ ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. మరి గాడ్ ఫాదర్ ఆచార్యను మరిపిస్తే.. మెగా ఫ్యాన్స్ ఆ బాధ నుంచి త్వరగానే బయటకు వస్తారు. మరో విశేషం ఏంటంటే.. గతంలో ఆచార్యను కూడా ఆగస్ట్ 13న విడుదల చేస్తాం అని ప్రకటించారు. కరోనా కారణంగా అది ఈ సమ్మర్ కు వచ్చింది.

Related Posts