కూతురు కోసం ప్లాన్ మార్చిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యు.వి.క్రియేషన్స్ లో ‘విశ్వంభర’ చేస్తున్నాడు. ఈ సినిమా చిరంజీవి 156వ చిత్రంగా తెరకెక్కుతోంది. అసలు.. మెగా 156 ‘విశ్వంభర’ కాదు. తన 156వ చిత్రాన్ని కూతురు సుస్మిత కొణిదెల నిర్మాణంలో కళ్యాణ్ కృష్ణ కురసాల తో చేయాల్సి ఉంది. ఓ మలయాళం మూవీ రీమేక్ గా తెరకెక్కాల్సిన ఆ చిత్రం ‘భోళా శంకర్’ రిజల్ట్ తో పక్కకు వెళ్లింది.

ఇప్పుడు మళ్లీ కూతురు కోసం ప్లాన్ మార్చాడట మెగాస్టార్. కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్టును హోల్డ్ లో ఉంచి.. ‘విశ్వంభర’ తర్వాత ఇమ్మీడియెట్ గా హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఒక చిత్రాన్ని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమాని సుస్మితకు సంబంధించిన గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే మెగా 157పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందట.

Related Posts