దర్శకుల సంఘం అధ్యక్షుడిగా వీరశంకర్

తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా వీరశంకర్‌ ఎన్నికయ్యారు. ఈరోజు (ఫిబ్రవరి 11న)
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో జరిగిన దర్శకుల సంఘం ఎన్నికల్లో మొత్తం 1113 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో వీరశంకర్, సముద్ర ప్యానల్స్ మధ్య ప్రధాన పోటీ జరిగింది. తెలుగు సీనీ దర్శకుల సంఘం ఎన్నికల్లో వీరశంకర్ ప్యానల్ ఘన విజయం సాధించింది. తెలుగు సినీ దర్శకుల సంఘం ప్రెసిడెంట్ గా డైరెక్టర్ వీర శంకర్ 232 ఓట్ల మెజారిటీ తో సముద్ర పై గెలుపొందారు.

‘విశ్వంభర’ దర్శకుడు వశిష్ఠ 576 ఓట్లతో, ‘బేబీ’ దర్శకుడు సాయి రాజేష్ 355 ఓట్ల తో ఈ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్స్ గా ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీగా సుబ్బారెడ్డి (396).. 2 ఓట్ల మెజారిటీతో మద్దినేని రమేష్ (394) పై గెలుపొందారు. జాయింట్ సెక్రటరీలు గా వడ్డాణం రమేష్, కస్తూరి శ్రీనివాస్.. ఆర్గనైజింగ్ సెక్రటరీలు గా ప్రియదర్శి, వంశీకృష్ణ.. ట్రెజరర్ గా పి.వి.రామారావు ఎన్నికయ్యారు.

Related Posts