మెగా ఫ్యామిలీ అంతా ఒకే ఫ్రేములో

మెగా ఫ్యామిలీ అంతా ఓ చోట చేరితే అక్కడ నెలకొనే పండగ వాతావరణం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంక్రాంతి వంటి పండగ సమయంలో ఆ సందడి మరింత రెట్టింపవుతోంది. మెగా కుటుంబం ప్రతీ సంక్రాంతిని బెంగళూరులోని ఫామ్ హౌజ్ లో జరుపుకుంటోంది. ఈ ఏడాది సంక్రాంతిని కూడా అక్కడ అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మెగా, అల్లు కుటుంబాలు కలిపి తీసుకున్న ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ వంటి హీరోలంతా ఈ మెగా ఫ్రేములో కనిపిస్తున్నారు. అయితే.. ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప మిగతా చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబాలకు సంబంధించిన అందరూ ఈ ఫోటోలో సందడి చేస్తున్నారు. పవన్ రాకపోయినా.. ఆయన తనయుడు అకిరా, కూతురు ఆద్య ఈ ఫోటోలో కనిపిస్తున్నారు.

Related Posts