రవితేజ డబ్బింగ్ లో ఏదో మ్యాజిక్ ఉంది

మాస్ మహారాజ రవితేజ కనిపిస్తే చాలు తన ఎనర్జీతో ఆ స్క్రీన్ కు నిండుదనం తీసుకొస్తాడు. అయితే.. కొన్నిసార్లు కనిపించకపోయినా వినిపించినా సరే ఆ సినిమాలను సూపర్ హిట్స్ గా మారుస్తున్నాడు. రవితేజ వాయిస్ ఓవర్ అందించిన చిత్రాలు సూపర్ డూపర్ హిట్స్ అవుతుండడమే అందుకు నిదర్శనం.

దర్శకధీరుడు రాజమౌళి కోసం సునీల్ హీరోగా నటించిన ‘మర్యాద రామన్న‘ మూవీలో ఓ సైకిల్ కి వాయిస్ ఇచ్చాడు రవితేజ. ఆ చిత్రంలోని రవితేజ వాయిస్ ఏ రేంజులో పేలిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ తర్వాత ‘అ!‘ మూవీలో ఓ బోన్సాయ్ ప్లాంట్ కి వాయిస్ ఇచ్చాడు. శివకార్తికేయన్ నటించిన ‘మహావీరుడు‘ కోసం కూడా తన వాయిస్ అందించాడు. ఇక.. లేటెస్ట్ గా ‘హనుమాన్‘ మూవీలోని కోతి పాత్రకు రవితేజ ఇచ్చిన వాయిస్ అదనపు ఆకర్షణగా నిలిచింది. అలా.. రవితేజ తన గళాన్ని అరువిస్తే చాలు ఆ సినిమాలు అదిరిపోయే హిట్స్ అవుతాయని ‘హనుమాన్‘ మరోసారి ప్రూవ్ చేసింది.

Related Posts