HomeLatestJr. NTR: పది రోజుల ఫైట్ కు ఎన్టీఆర్ రెడీ

Jr. NTR: పది రోజుల ఫైట్ కు ఎన్టీఆర్ రెడీ

-

ఆర్ఆర్ఆర్(RRR) తో గ్లోబల్ స్టార్ గా మారాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr.NTR). ఎలాంటి పాత్రైనా చేయగల దమ్మున్న ఏకైక టాలీవుడ్ స్టార్ గా ఎప్పుడో ప్రూవ్ చేసుకున్న యంగ్ టైగర్ కు ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను తెచ్చింది. ఆ అభిమానం చెదిరిపోకుండా ఉండాలంటే తర్వాతి ప్రాజెక్ట్స్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాలి. అందుకే కొరటాల శివ(Kortala Siva) సినిమా కోసం చాలా టైమ్ తీసుకున్నాడు.

కథ పక్కాగా కుదిరే వరకూ ఆగాడు. ఫైనల్ గా మార్చిలో ఈ మూవీ ప్రారంభం అయింది. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. కొరటాల మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఫస్ట్ టైమ్ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janvi Kapoor) సౌత్ ఇండస్ట్రీ(South Industry)కి పరిచయం అవుతోంది.

జాన్వీ తల్లి శ్రీదేవి(Sri Devi), ఎన్టీఆర్ తాత సీనియర్ ఎన్టీఆర్(Sr. NTR) పెయిర్ కు తెలుగు నాట తిరుగులేని క్రేజ్ ఉంది. దీంతో ఈ ఇద్దరూ కలిసి నటిస్తుండటంతో ఇప్పుడు పాత తరం ప్రేక్షకులు కూడా ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తిగా ఉన్నారు.


ఇక షూటింగ్ ప్రారంభం అయిన దగ్గర్నుంచీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ మూవీ కోసం ఒక భారీ యాక్షన్ సీన్ ను చిత్రీకరించబోతున్నాడు కొరటాల శివ. ఇందుకోసం శంషాబాద్(Shamshabad) ఏరియాలో ఓ భారీ సెట్ కూడా వేశారు. ఈ సెట్ లోనే ఏకంగా పది రోజుల పాటు ఈ ఫైట్ ను షూట్ చేయబోతున్నారు. ఇది సినిమాలోని హైలెట్స్ లో ఒకటిగా ఉంటుందని చెబుతున్నారు.


ఇక మరోవైపు కొరటాల తర్వాత ప్రశాంత్ నీల్(Prashanth Neel) సినిమా చేస్తాడు ఎన్టీఆర్. ఈ మూవీ ఈ యేడాది అక్టోబర్ లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. అలాగే బాలీవుడ్(Bollywood) లో హృతిక్ రోషన్(Hrithik Roshan) తో కలిసి ‘వార్2’ చేయబోతున్నాడు.

ఈ బాలీవుడ్ మూవీ కోసం ఎన్టీఆర్ కు ఏకంగా 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నారు. మొత్తంగా ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న కొరటాల శివ సినిమా 2024 ఏప్రిల్ 5న సమ్మర్ స్పెషల్ గా విడుదల కాబోతోంది.

ఇవీ చదవండి

English News