తెలుగు సినిమా పరిశ్రమలో మల్టీ టాలెంటెడ్ అనగానే మొదట గుర్తొచ్చేది యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR). తను నటుడే కాదు. డ్యాన్సర్, సింగర్, యాంకర్ కూడా. యాంకర్ గా మొదట బిగ్ బాస్(Big Boss) ఫస్ట్ సీజన్ ను ది బెస్ట్ గా హోస్ట్ చేశాడు. ఇప్పటికీ ఆ షో ను ఎన్టీఆర్ లా ఎవరూ రక్తి కట్టించలేదు అంటే అతిశయోక్తి కాదు.
ఆ తర్వాత ఎవరు మీలో కోటీశ్వరుడు షో ను సైతం నెక్ట్స్ లెవల్ లో హోస్ట్ చేశాడు. విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందిస్తూ.. ఆబాల గోపాలాన్నీ అలరించాడు ఎన్టీఆర్. నటనలోనే కాదు యాంకరింగ్ లోనూ అతని ప్రతిభకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
అందుకే చాలామంది మళ్లీ కొత్త షోస్ తోనో లేక బిగ్ బాస్ కోసమో మళ్లీ హోస్టింగ్ చేయమని.. బ్లాస్టింగ్ అమౌంట్ కూడా కోట్ చేశారు. మరి ఎందుకో ఆ తర్వాత బుల్లితెరపై కనిపించలేదు యంగ్ టైగర్. బట్ లేటెస్ట్ గా వినిపిస్తోన్నదాన్ని బట్టి ఎన్టీఆర్ మరోసారి హోస్ట్ చైర్ లో కూర్చోబోతున్నాడు అంటున్నారు.
ప్రస్తుతం బుల్లితెరను దాటి ఓటిటిల హవా నడుస్తోంది. ఈ ప్లాట్ ఫామ్ పై వచ్చే షోస్ కూడా ఓ రేంజ్ లో రక్తి కట్టిస్తున్నాయి. అందుకు ఆహాలో బాలకృష్ణ(Balakrishna) అన్ స్టాపబుల్(Un Stoppable) బెస్ట్ ఎగ్జాంపుల్. బాబాయ్ షో బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి అబ్బాయ్ ని కూడా ఓటిటిలోకి దించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అయితే ఈ సారి ఆహా కాదు. ఈటీవీ కొత్త ఓటిటి ప్లాట్ ఫామ్ లో ప్రసారం కాబోతోన్న ఓ టాక్ షోకు హోస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. అంతే కాదు.. ఈ షో చేయడానికి ఎన్టీఆర్ కూడా సుముఖంగానే ఉన్నట్టు టాక్.
అంటే షో డిజైనింగ్ బావుందట. ఇప్పటి వరకూ వచ్చి షోస్ కంటే కాస్త భిన్నంగా ఉండటంతో చేయడానికి దాదాపు ఓకే చెప్పినట్టు సమాచారం. కాకపోతే ప్రస్తుతం అతను కొరటాల శివ ప్రాజెక్ట్ తో చాలా బిజీగా ఉన్నాడు. తర్వాత బాలీవుడ్ మూవీ వార్ సీక్వెల్ తోపాటు ప్రశాంత్ నీల్ సినిమాలున్నాయి. అయినా డేట్స్ అడ్జెస్ట్ చేసి నెలకు ఓ నాలుగు రోజులు కేటాయిస్తే.. రెండు నెలల అవుట్ పుట్ వస్తుందని కన్విన్స్ చేసే ప్రయత్నాల్లో ఈటీవి ఉందట. మరి ఇది వర్కవుట్అవుతుందా లేదా అనేది చూడాలి.