Akkineni Heros: అక్కినేని హీరోలకు కలిసి రాని ఇంగ్లీష్ టైటిల్స్

అక్కినేని హీరోల బ్యాడ్ ఫేజ్ కంటిన్యూ అవుతూనే ఉంది. కస్టడీ(Custody)తో నాగ చైతన్య(Naga Chaitanya) బ్లాక్ బస్టర్ కొడతాడు అనుకుంటే అతను కూడా యావరేజ్ దగ్గరే ఆగిపోయాడు. కాకపోతే తండ్రి, తమ్ముడులా మరీ డిజాస్టర్ అనిపించుకోలేదీ చిత్రం. తరచి చూస్తే కొన్ని రోజులుగా అక్కినేని హీరోల సినిమాల టైటిల్స్ ఇంగ్లీష్ లో ఉంటున్నాయి.

ఇలా ఇంగ్లీష్ టైటిల్స్ ఉన్న చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అంటున్నాయి. ఈ క్రమంలో అప్పుడెప్పుడో రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) డైరెక్షన్ లో నాగార్జున చేసిన ఆఫీసర్(Officer) సినిమా నుంచీ మొదలైందీ టైటిల్స్ గోల అనిపిస్తోంది. ఆఫీసర్ ఆల్ టైమ్ టాలీవుడ్ డిజాస్టర్స్ లో ఒకటిగా చేరింది. ఇక అఖిల్(Akhil) చేసిన మిస్టర్ మజ్ను(Mr. Majnu) పూర్తి ఇంగ్లీష్ టైటిల్ అనలేం కానీ ఇదీ పోయింది. తర్వాత వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్(Most Eligible Bachulor) ఇంగ్లీష్‌ టైటిల్. ఇది జస్ట్ యావరేజ్ గా మిగిలింది.


గతేడాది దసరా(Dasara)కు వచ్చిన నాగార్జున(Nagarjuna)ఘోస్ట్(Ghost) కూడా డిజాస్టర్ గా మిగిలింది. నిజానికి ఈ టైటిల్ తో పాటు ట్రైలర్ చూసి నాగ్ ఈ సారి సాలిడ్ హిట్ కొడతాడు అనుకున్నారు ఫ్యాన్స్. జనరల్ ఆడియన్స్ సైతం అదే భావించారు. బట్ దసరా బరిలో నిలిచినా.. ఘోస్ట్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ ఎఫెక్ట్ తోఇప్పటి వరకూ నాగ్ మరో సినిమా స్టార్ట్ కూడా చేయకపోవడం విశేషం.


నాగ చైతన్య థ్యాంక్యూ(Thank You) పరిస్థితీ అంతే. మనం దర్శకుడు విక్రమ్ కుమార్(Vikram Kumar) డైరెక్ట్ చేసిన ఈ మూవీపై చైతూ ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకున్నారు. పాటలు బానే ఉన్నాయి అనిపించుకుంది. ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు కనిపించారు. ఒక మనిషి లైఫ్ లో భిన్న దశలను చూపించిన ఈ చిత్రం కూడా పోయింది.


ఇక అఖిల్(Akhil) హీరోగా నటించిన రీసెంట్ మూవీ ఏజెంట్(Agent) పరిస్థితి ఏంటో కొత్తగా చెప్పక్కర్లేదు. ఇదీ అంతే రిలీజ్ కు ముందు అంచనాలు పెంచింది. బట్ వాటిని అందుకోవడంలో బోల్తా పడింది. అత్యంత భారీ బడ్జెట్ తో వచ్చిన ఏజెంట్ బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం ప్రభావం చూపక.. బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది.


సో ప్రస్తుతం అక్కినేని లెగసీయే ప్రమాదంలో ఉంది అని చర్చించుకుంటోన్న టైమ్ లో కస్టడీతో నాగ చైతన్య(Naga Chaitanya) ఆ లెగసీని లేపుతాడు అనుకున్నారు. బట్ ఈ శుక్రవారం వచ్చిన కస్టడీ(Custody) అబౌ యావరేజ్ గా మాత్రమే మిగిలింది. కొంతమంది డిజాస్టర్ అంటున్నారు కానీ.. మరీ డిజాస్టరస్ మూవీ అయితే కాదు. మరి కంటెంట్ వల్లా.. ఇంగ్లీష్‌ టైటిల్స్ వల్లా అంటే ఖచ్చితంగా కంటెంట్ వల్లే వీళ్లు లాస్ అవుతున్నారు. కానీ అనుకోకుండా ఆంగ్ల పేర్లు అలా సెంటిమెంట్ లాగానూ కనిపిస్తున్నాయి. మరి ఈ సెంటిమెంట్ ను బ్రేక్ ఎంచక్కా సోగ్గాడు అనో.. బంగార్రాజు అనో తెలుగు పేర్లు పెట్టుకుంటారా లేక ఇంగ్లీష్‌ టైటిల్స్ ను కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి.

Related Posts