మరో ఇద్దరు తెలుగు స్టార్స్ తో కియరా అద్వానీ

బాలీవుడ్ బ్యూటీస్ అంతా వరుసగా టాలీవుడ్ కి క్యూ కడుతున్నారు. తెలుగు హీరోలతో నటించడానికి పోటీ పడుతున్నారు. ఈ లిస్టులో కియారా అద్వానీ కూడా ఉంది. ఇప్పటికే తెలుగులో మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’, రామ్ చరణ్ తో ‘వినయ విధేయ రామ’ చిత్రాలలో నాయికగా నటించింది కియారా. ప్రస్తుతం చరణ్ తో రెండోసారి నటిస్తుంది. ‘గేమ్ ఛేంజర్’లో కియారా ఎంతో ప్రాధాన్యత గల పాత్రలో కనిపించనుందట.

టాలీవుడ్ టాప్ స్టార్స్ లో మరో ఇద్దరితోనూ కియారా నటించడానికి రెడీ అవుతోందట. వారిలో ఎన్టీఆర్ అయితే.. మరొకరు ప్రభాస్. ఎన్టీఆర్-హృతిక్ రోషన్ మల్టీస్టారర్ ‘వార్ 2’లో కియారా అద్వానీ కూడా నటిస్తోంది. అయితే.. ఈ సినిమాలో కియారా.. ఎన్టీఆర్ కి జోడీగా నటిస్తోందా? లేక హృతిక్ తో పెయిర్ గా చేస్తోందా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక.. రెబెల్ స్టార్ ప్రభాస్ తోనూ కియారా అద్వానీ నటించనుందట. ప్రభాస్-ప్రశాంత్ నీల్ మోస్ట్ అవైటింగ్ ‘సలార్ 2’లో కియారాని మరో నాయికగా తీసుకున్నారనే ప్రచారం ఉంది. ఈ సినిమాలో ఆల్రెడీ శ్రుతి హాసన్ ఒక హీరోయిన్ గా నటిస్తుండగా.. కియారా ఇంకొక హీరోయిన్ గా కనువిందు చేయనుందట.

Related Posts