ముంబైలో మొదలైన ‘కుబేర’

నాగార్జున, ధనుష్ కలయికలో రూపొందుతోన్న మల్టీస్టారర్ ‘కుబేర’. చేతిలో చిల్లిగవ్వ లేని స్థితి నుంచి అక్రమ మార్గాల ద్వారా కోట్లకు అధిపతి గా మారిన ఓ వ్యక్తి కథతో ‘కుబేర’ని తెరకెక్కిస్తున్నాడట డైరెక్టర్ శేఖర్ కమ్ముల. టైటిల్ రోల్ లో ధనుష్ నటిస్తున్న ఈ మూవీలో నాగార్జున పోలీసాఫీసర్ పాత్రలో కనువిందు చేయబోతున్నాడు. ఈ మూవీలో ధనుష్ కి జోడీగా రష్మిక నటిస్తుంది.

ఆమధ్య బ్యాంకాక్‌ లో కీలక షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ‘కుబేర’.. లేటెస్ట్ గా ముంబైలో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టుకుంది. దాదాపు రెండు వారాల పాటు సాగే ఈ షెడ్యూల్ లో కొన్ని ప్రధాన సన్నివేశాలతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ కూడా జరగనుందట. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్నాడు. సోనాలి నారంగ్‌ సమర్పణలో సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాదే ఈ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Related Posts