‘డంకీ డ్రాప్ 5‘.. ఎడారిలో షారుక్, తాప్సీ ప్రేమ పాట

‘డంకీ‘ డ్రాప్స్ పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలన్నింటికీ మంచి స్పందన వచ్చింది. లేటెస్ట్ గా ‘డంకీ డ్రాప్ 5‘ పేరుతో ఓ సాంగ్ రిలీజ్ చేశారు. హీరోహీరోయిన్లు షారుక్, తాప్సీ మధ్య ఎడారి నేపథ్యంలో చిత్రీకరించిన గీతం ఇది. కథలో భాగంగా వచ్చే ‘ఓ మాయి‘ అంటూ సాగే ఈ గీతాన్ని ప్రీతమ్ స్వరపరచగా.. అర్జీత్ సింగ్ అద్భుతంగా ఆలపించాడు.

అనుమతులు లేకుండా సరిహద్దులు దాటి లండన్ వెళ్లాలలనుకునే కొంతమంది మిత్రుల కథగా.. రాజ్ కుమార్ హిరాణి ‘డంకీ‘ సినిమాని తెరకెక్కించాడు. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కి పెద్ద పీట వేస్తూ ఈ సినిమా రాబోతుంది. ఈ చిత్రంలో షారుక్, తాప్సీతో పాటు విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న ‘డంకీ‘ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Related Posts