‘సలార్‘ మ్యూజికల్ జర్నీ మొదలవ్వబోతుంది

సినిమా తీయడం ఒకెత్తయితే.. ఆ చిత్రాన్ని ఆడియన్స్ లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. ఇక.. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందే సినిమాల ప్రచారం విషయంలో దర్శకనిర్మాతల ప్రత్యేకమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. సినిమా విడుదలకు రెండు, మూడు నెలల ముందు నుంచే ప్రచారాన్ని షురూ చేస్తారు. కానీ.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సలార్‘ ప్రచారంలో ఎలాంటి కదలిక లేదు.

‘కె.జి.యఫ్‘ సిరీస్ ను నిర్మించిన హోంబల్ ఫిల్మ్స్ ‘సలార్‘ని ప్రొడ్యూస్ చేస్తోంది. ‘కె.జి.యఫ్‘ ప్రచారం కోసం ఈ నిర్మాణ సంస్థ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ‘కె.జి.యఫ్‘ రెండు పార్టులు రిలీజ్ కు ముందు హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరోయిన్ శ్రీనిధి శెట్టి యావత్ దేశాన్ని చుట్టేశారు. కానీ.. ‘సలార్‘ కోసం ఇప్పటివరకూ ఏ ఒక్కరూ బయటకు రాలేదు. సినిమా విడుదలకు ఇంకా కేవలం పది రోజులు మాత్రమే ఉంది.

హీరో ప్రభాస్ ఏమో ‘కల్కి‘ షూట్ తో బిజీగా ఉన్నాడు. పృథ్వీరాజ్ తన చిత్రాల సందడిలో పడిపోయాడు. హీరోయిన్ శ్రుతి హాసన్ ది అదే పద్ధతి. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఏమో ‘సలార్‘ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో మునిగిపోయాడు. అయితే.. లేటెస్ట్ గా ‘సలార్‘ మ్యూజికల్ జర్నీకి శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తోంది. ‘సలార్‘ ఫస్ట్ సింగిల్ అనౌన్స్ మెంట్ ను ఈరోజే చేయబోతున్నారట.

Related Posts