శేష్-శ్రుతి.. యూనిక్ కాంబినేషన్

అడవి శేష్, శ్రుతి హాసన్.. ఊహకందని కాంబినేషన్ ఇది. అయితే.. ఈ యూనిక్ కాంబినేషన్ ను సెట్ చేసింది అన్నపూర్ణ స్టూడియోస్. సుప్రియ యార్లగడ్డ నిర్మాణంలో.. ఏషియన్ సునీల్ సహ నిర్మాతగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందబోతుంది. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ షేనియల్ డియో దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ కాంబోని అనౌన్స్ చేయడంతో పాటు ‘శేష్ ఎక్స్ శ్రుతి‘ అనే హ్యాష్ ట్యాగ్ ని కూడా జతచేశారు. ఏ యూనిక్ స్టోరీ ఆఫ్ లవ్ అండ్ బియాండ్ అంటూ ఈ సినిమాని ఓ కొత్త ప్రేమకథగా ఆవిష్కరించబోతున్నట్టు చెప్పకనే చెప్పారు మేకర్స్. మిగతా విషయాలు త్వరలో రివీల్ చేయనున్నారట.

Related Posts