కాంట్రవర్శీయల్ డైరెక్టర్ తో రామ్ చరణ్‌ ..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ మూవీస్ లైనప్ పెరుగుతూనే ఉంది. ఈ లిస్ట్ చూస్తోంటే నిజంగా అతను అన్ని సినిమాలు ఒప్పుకున్నాడా అనే డౌట్ వస్తుంటుంది కూడా. ప్రస్తుతం శంకర్ తో సినిమా చేస్తున్నాడు. అన్నీ కుదిరితే ఈ మూవీ ఈ యేడాదే వస్తుంది. తర్వాత బుచ్చిబాబుతో ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది.

దీంతో పాటు కన్నడ దర్శకుడు నర్తన్ తో కూడా ఓ మూవీ ఉంటుంందనే వార్తలున్నాయి. ఇక ఇప్పుడు మరో దర్శకుడు పేరు వినిపిస్తోంది. అయితే ఇతను బాలీవుడ్ డైరెక్టర్. ఇంతకు ముందో కాంట్రవర్శీయల్ డాక్యుమెంటరీ తరహా సినిమాతో 300కోట్ల సినిమా చేశాడు. మరి ఈ దర్శకుడెవరు.. ఈయనతో సినిమా చేస్తే నిజంగా రామ్ చరణ్‌ కు మైలేజ్ ఉంటుందా ..?


ఆర్ఆర్ఆర్ తో దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ను ఆకట్టున్నాడు రామ్ చరణ్‌. రామ్ పాత్రలో అద్బుతమైన నటన చూపించి అందరినీ మెస్మరైజ్ చేశాడు. ఆ మూవీ తర్వాత వచ్చిన ఆచార్య పెద్దగా ఆకట్టుకోలేదు. బట్ శంకర్ తో చేస్తోన్న మరో ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ మాత్రం ఖచ్చితంగా మరోసారి ఆ స్థాయిలో బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్ముతున్నారు అందరూ. ఇక ఈ చిత్రం తర్వాత అతను జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయాలి. కానీ కథ నచ్చలేదని ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.

ఆ డేట్స్ ను ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుకు ఇచ్చాడు. ఈ కథ కూడా ఎన్టీఆర్ కోసం అనుకున్నాడు బుచ్చిబాబు. అతనితో చేయడానికి చాలా టైమ్ పడుతుందనే రామ్ చరణ్ తో ఓకే చేయించాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. మరోవైపు కన్నడ దర్శకుడు నర్తన్ కూడా చరణ్‌ కు కథ చెప్పాడనే వార్తలున్నాయి. అవింకా కన్ఫార్మ్ కాలేదు.

ఇక లేటెస్ట్ గా మరో బాలీవుడ్ డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. 2022లో కశ్మీర్ ఫైల్స్ అనే సినిమాతో చాలా పెద్ద విజయం అందుకున్న వివేక్ అగ్నిహోత్రి డైరెక్షన్ లో రామ్ చరణ్‌ సినిమా చేయబోతున్నాడనే న్యూస్ హల్చల్ చేస్తోంది. నిజానికి కశ్మీర్ ఫైల్స్ డాక్యుమెంటరీ తరహాలో ఉంటుంది. టేకింగ్, మేకింగ్ లో చాలా మైనస్ లున్నాయి.

అలాంటి దర్శకుడితో చరణ్ సినిమా చేస్తాడు అనే వార్తలో నిజమెంత అనేది అనుమానమే. అయితే వివేక్ అగ్నిహోత్రిపై దేశంలో ఒక వర్గం ప్రేక్షకుల్లో చాలా విమర్శలున్నాయి. అలాంటి డైరెక్టర్ తో చరణ్‌ లాంటి స్టార్ సినిమా చేయడం ఎంత వరకూ కరెక్ట్ అనే ప్రశ్నలు కూడా అప్పుడే వినిపిస్తున్నాయి.

అయితే రీసెంగా అతను మరో డైరెక్ట్ బాలీవుడ్ మూవీ చేయబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి. అది ఈ చిత్రమేనా లేక మరో దర్శకుడితోనా అనేది తేలాలి. అయితే కంటెంట్ ఉంటే దర్శకుడితో పనిలేకుండా చూస్తారు అనేది కొత్తగా చెప్పక్కర్లేదు. మరి వివేక్ తో చరణ్ మూవీ గురించి మెగా టీమ్ క్లారిటీ ఇస్తే బెటర్.

Related Posts